పదవ తరగతి అర్హతతో రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగాలు….. ఇలా అప్లై చేసుకోండి! | RBI Jobs Notification 2026 Apply Now :
RBI Jobs 2026 నోటిఫికేషన్ పూర్తి వివరాలు:
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి 2026 సంవత్సరానికి గాను కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పదవ తరగతి (10th Pass) అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారికి, స్థిరమైన జీతం మరియు భద్రత ఉన్న ఉద్యోగం కావాలనుకునే వారికి RBI ఉద్యోగాలు ఒక మంచి అవకాశం.
దేశవ్యాప్తం గా ఉన్న బ్యాంకు అఫ్ ఇండియా లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసారు. ఇందులో మొత్తం 572 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా అర్హత కూడా 10th పాస్ అయితే చాలు. వయస్సు కూడా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం లోనే అప్లై చేసుకోవాలి. అంతే కాదు ఆకర్షణీయమైన జీతం కూడా ఉంటుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు 4 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
RBI ఉద్యోగాల ముఖ్య వివరాలు:
సంస్థ పేరు: రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ( RBI ) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి
మొత్తం పోస్టులు : 572
రిక్రూట్మెంట్ విధానం: పెర్మనెంట్
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
విద్య అర్హతలు:
ఈ RBI Jobs 2026 కి అప్లై చేయాలంటే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
1. అభ్యర్థి 10వ తరగతి (SSC) పూర్తి చేసి ఉండాలి.
2. గుర్తింపు పొందిన బోర్డు నుంచి చదువు పూర్తి చేసి ఉండాలి.
3. స్థానిక భాషపై ప్రాథమిక అవగాహన ఉండాలి.
4. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటె అదనపు ప్రయోజనం.
వయో పరిమితి :
1. కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు , Pwbd అభ్యర్థులకు 10 ఇయర్స్ ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC/ EWS అభ్యర్థులకు : రూ. 450/-
2. SC / ST / PwBD అభ్యర్థులకు : రూ. 50/- ఫీజు చెల్లించాలి.
3. ఈ ఫీజు ఆన్లైన్ విధానం లో చెల్లించాలి.
శాలరీ వివరాలు:
RBI లో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగానికి ఆకర్షణీయమైన జీతం ఉంటుంది:
1. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి రూ 46,029/- జీతం ఇస్తారు.
2. DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా ఉంటాయి.
3. పెన్షన్, మెడికల్ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది.
ఎంపిక విధానం:
RBI ఉద్యోగాల కోసం సాధారణంగా ఈ క్రింది విధంగా ఎంపిక జరుగుతుంది:
1. ఆన్‌లైన్ పరీక్ష (Online Examination)
2. భాషా నైపుణ్య పరీక్ష (Language Test)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ లేకుండా కూడా ఎంపిక జరుగుతుంది. అందువల్ల ఇది పదవ తరగతి అర్హత కలిగిన వారికి మంచి అవకాశం.
ఎలా అప్లై చేసుకోవాలి?
RBI Jobs 2026 కి అప్లై చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి:
1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. “Recruitment / Careers” సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడాలి.
3. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
4. అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
5. ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.
6.దరఖాస్తు రుసుము చెల్లించాలి.
7. అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 4 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Link Online : Click Here