AP Jobs : ఆంధ్రప్రదేశ్ లో 216 అంగన్వాడీ వర్కర్స్ & ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్ | AP ICDS Anganwadi Jobs 2026 Full Details :

AP Jobs : ఆంధ్రప్రదేశ్ లో 216 అంగన్వాడీ వర్కర్స్ & ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్ | AP ICDS Anganwadi Jobs 2026 Full Details :

AP ICDS Anganwadi Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. ICDS (Integrated Child Development Services) శాఖ ఆధ్వర్యంలో 216 అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ మరియు మినీ అంగన్వాడీ వర్కర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు కాగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మంచి అవకాశంగా నిలుస్తాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్య వంటి సేవలలో ఆసక్తి ఉన్న మహిళలు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 216 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతేకాదు ఈ ఉద్యోగాలకి 7th , 10th క్లాస్ పాస్ అయితే చాలు. స్థానిక వివాహిత మహిళలే ఉండాలి. వయస్సు కూడా 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కావున ఆసక్తి గల వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అంగన్వాడీ ఉద్యోగాల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: ICDS (Integrated Child Development Services)

పోస్టుల వివరాలు: పోస్టుల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

1. అంగన్వాడీ వర్కర్

2. మినీ అంగన్వాడీ వర్కర్

3.అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 216

విద్య అర్హతలు:

1. కనీస విద్యార్హత: 7th ,10వ తరగతి ఉత్తీర్ణత.

2. అభ్యర్థి సంబంధిత గ్రామం / వార్డు నివాసి అయి ఉండాలి.

3. మహిళా అభ్యర్థులకే అర్హత.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST / BC / EWS / దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

శాలరీ డీటెయిల్స్:

ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా నెలవారీ వేతనం అందించబడుతుంది.

1.అంగన్వాడీ వర్కర్: సుమారు ₹10,000 – ₹12,000

2. అంగన్వాడీ హెల్పర్: సుమారు ₹6,000 – ₹8,000

3. జీతంతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా ఉంటాయి.

4. జీతం పోస్టు మరియు జిల్లా ఆధారంగా మారవచ్చు.

ఎంపిక విధానం:

1.ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక ఈ విధంగా జరుగుతుంది:

2. విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారం గా ఎంపిక చేస్తారు.

3. స్థానిక నివాసానికి ప్రాధాన్యం ఇస్తారు.

4. ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

2. అధికారిక వెబ్‌సైట్ నుండి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

3. దరఖాస్తు ఫారం పూర్తి వివరాలతో నింపండి.

4. అవసరమైన సర్టిఫికేట్ల ఫోటోకాపీలు జత చేయండి.

5. సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లేదా అంగన్వాడీ కేంద్రంలో సమర్పించండి.

అవసరమైన డాక్యుమెంట్లు:

విద్యా ధృవపత్రాలు

వయస్సు సర్టిఫికేట్

కుల ధృవపత్రం (అవసరమైతే)

నివాస ధృవపత్రం

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 05 ఫిబ్రవరి 2026

Official Website : Click Here

Notification1 pdf : Click Here

Notification 2 pdf : Click Here

Application pdf : Click Here

Leave a Comment