డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి.!| IISER Recruitment 2026 Apply Now :
Tirupati IISER Recruitment 2026:
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మెడికల్ ఆఫీసర్, నర్సు, ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, వంటి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 10వ తరగతి నుండి డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. అంతేకాదు వయసు కూడా 40 సంవత్సరాలు మించకూడదు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
IISER Recruitment 2026 Junior Office Assistant Jobs – పూర్తి వివరాలు:
పోస్టుల వివరాలు:
IISER తిరుపతి మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తోంది. పోస్టుల వారీగా ఖాళీలు కింద చూడండి:
Assistant Executive Engineer (Civil): 01
Medical Officer: 01
Assistant Registrar: 01
Nurse: 01
Private Secretary: 01
Superintendent: 02
Technical Assistant (IT): 02
Technical Assistant (Biology): 02
Junior Library Superintendent: 01
Junior Translator (Rajbhasha): 01
Junior Office Assistant (Multi Skill): 06 (ఎక్కువ ఖాళీలు)
Lab Assistant (Biology/Chemistry/Physics): 03 (ఒక్కో సబ్జెక్టులో 1)
మొత్తం పోస్టులు : 22
విద్య అర్హతలు:
1. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (Junior Office Assistant):
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ (Any Degree) పూర్తి చేసి ఉండాలి
కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, టైపింగ్, డేటా ఎంట్రీ) ఉండాలి
ఇంగ్లీష్ & స్థానిక భాషలపై ప్రాథమిక అవగాహన ఉండాలి
2.ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant):
ఇంటర్మీడియట్ / డిప్లొమా / బి.ఎస్‌సి (సైన్స్) పూర్తి చేసి ఉండాలి
ప్రయోగశాల పనుల్లో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యత ఉంటుంది
3. టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ) – Technical Assistant (IT):
బి.ఈ / బి.టెక్ / ఎం.సి.ఏ / బి.సి.ఏ / ఎం.ఎస్‌సి (కంప్యూటర్ సైన్స్ / ఐటీ) పూర్తి చేసి ఉండాలి
కంప్యూటర్ నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో అవగాహన ఉండాలి
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది
4. నర్స్ (Nurse):
బి.ఎస్‌సి నర్సింగ్ (B.Sc Nursing) పూర్తి చేసి ఉండాలి
సంబంధిత రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఆసుపత్రిలో పని చేసిన అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది
5. ఏఈఈ (సివిల్) – AEE (Civil):
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బి.ఈ / బి.టెక్ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేసి ఉండాలి
ప్రభుత్వ / ప్రైవేట్ ప్రాజెక్ట్‌లలో సివిల్ వర్క్స్ అనుభవం ఉంటే ప్రాధాన్యత
డ్రాయింగ్, ఎస్టిమేషన్, సూపర్విజన్ పనులపై అవగాహన ఉండాలి
6. మెడికల్ ఆఫీసర్ (Medical Officer):
ఎం.బి.బి.ఎస్ (MBBS) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా / NMC లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో పని అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయో పరిమితి:
1. Group A : 40 సంవత్సరాలు
2. Group B : 35 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. Group C : 30 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు సడలింపు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
SC / ST వర్గాలకు చెందిన అభ్యర్థులు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాల మినహాయింపును పొందుతారు.
OBC కేటగిరీకి చెందిన వారికి 3 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.
దివ్యాంగులైన (PwBD) అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.
మాజీ సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నియామక నియమాలు అనుసరించబడతాయి.
దరఖాస్తు రుసుము:
Group A పోస్టులకు :
1. General/OBC/EWS అభ్యర్థులకు : రూ. 1000/- ఫీజు ఉంటుంది.
2. SC/ST అభ్యర్థులకు : రూ. 500/-
Group B & C పోస్టులకు:
1. General/OBC/EWS: రూ. 750/- ఫీజు ఉంటుంది.
2. SC/ST: రూ. 375/- చెల్లించాలి.
PwBD అభ్యర్థులకు: ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
1.ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి Group A : లెవెల్ 10 – రూ 56,100/-
2. Group B : లెవెల్ 6/7 – రూ 35,400/- నుంచి రూ 44,900/- వరకు జీతం ఇస్తారు.
3. Group C – లెవెల్ 3 / 4 – రూ 21,700/- నుంచి రూ 25,500/- వరకు జీతం ఇస్తారు.
4. అదనంగా DA, HRA, TA వంటి ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
IISER జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. సాధారణంగా కింది విధానంలో ఎంపిక చేస్తారు:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ iisertirupati.ac.in ను సందర్శించండి.
2. “Careers” లేదా “Recruitment” సెక్షన్‌పై క్లిక్ చేయండి.
3. “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
4. మీ వివరాలన్నీ తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.
5. ఫోటో, సంతకం మరియు సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
6. ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించండి.
7. అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 02 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Online Application Link : Click Here