Central Govt Jobs

పదవ తరగతి అర్హతతో రైల్వే లో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 Apply Now :

calendar_month January 31, 2026 person chitra

పదవ తరగతి అర్హతతో రైల్వే లో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 Apply Now :

Railway Group D Recruitment 2026:

హాయ్ ఫ్రెండ్స్…. నిరుద్యోగులకు శుభవార్త…. Railway Recruitment Board (RRB) అథారిటీ 30 జనవరి 2026న RRB Group D Recruitment 2026 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 21,997 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ ఉద్యోగాలు భారతీయ రైల్వేలో వివిధ Level-1 (గ్రూప్ D) ఉద్యోగాలుగా ఉన్నాయి. అంతేకాదు ఈ ఉద్యోగాలకి పదవ తరగతి అర్హత ఉంటె చాలు. వయస్సు కూడా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిసికల్ టెస్టులు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పదవ తరగతి అర్హతతో రైల్వే గ్రూప్ D ఉద్యోగాలు 2026 – పూర్తి వివరాలు:

సంస్థ పేరు: Railway Recruitment Board (RRB) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: రైల్వే గ్రూప్ D లెవెల్ 1 ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 21,997

విద్య అర్హతలు:

1. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 వ తరగతి పాస్ అయి ఉండాలి.

2. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయో పరిమితి:

1. అభ్యర్థి వయస్సు 18 – 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది విధం గా ఫీజు చెల్లించాలి.

1. UR ,EWS , OBC అభ్యర్థులకు రూ 500/- ఫీజు చెల్లించాలి.

2. SC , ST , PHC అభ్యర్థులకు రూ 250/- ఫీజు కట్టాలి.

శాలరీ వివరాలు:

Railway Group D ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి పోస్టును అనుసరించి 40 వేల నుండి 70 వేల రూపాయల వరకు జీతం ఇస్తారు. అంతేకాదు ఇతర రకాల అలవెన్సుస్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

1. Computer Based Test (CBT)

2. Physical Efficiency Test (PET) – శారీరక పరీక్ష (పురుషులు/స్త్రీలు వేరే ప్రమాణాలు).

3. Document Verification (డాక్యుమెంట్ వెరిఫికేషన్)

4. Medical Examination (మెడికల్ పరీక్ష) నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా Railway Recruitment Board అధికారిక వెబ్‌సైట్ అయిన www.rrbapply.gov.in లేదా rrbcdg.gov.in ను ఓపెన్ చేయాలి.

2. హోమ్ పేజీలో “RRB Group D Notification 2026 / Apply Online” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

3. మొదటిసారి అప్లై చేస్తున్న అభ్యర్థులు New Registration పై క్లిక్ చేసిపేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి వంటి వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక Registration ID & Password వస్తాయి.

4. ఇప్పుడు Login చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.

5. అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

6. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

7. అన్ని వివరాలు మరోసారి చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.

8. దరఖాస్తు పూర్తయ్యాక అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ: 31 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 2 మార్చ్ 2026

Official Website : Click Here

Notification pdf : Click Here

Apply Online : Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *