Central Govt Jobs

పదవ తరగతి అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | CURAJ Non – Teaching Recruitment 2026 Full Details :

calendar_month January 31, 2026 person chitra

పదవ తరగతి అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | CURAJ Non – Teaching Recruitment 2026 Full Details :

CURAJ Non – Teaching Recruitment 2026:

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ (CURAJ) ద్వారా Non-Teaching పోస్టుల భర్తీ కోసం 2026 సంవత్సరానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.ఈ CURAJ Non-Teaching Recruitment 2026 ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం జీతభత్యాలు, ఇతర అలవెన్సులు అందిస్తారు.

సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ రాజస్థాన్ విశ్వ విద్యాలయం లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 05 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి వయస్సు కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10th క్లాస్, any డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు కూడా ఆన్లైన్ లో చేసుకోవాలి. కావున ఆసక్తి గల అభ్యర్థులు 20 మార్చ్ 2026 లోపు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు- ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ రాజస్థాన్ విశ్వ విద్యాలయం లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్

2. లోయర్ డివిజన్ క్లర్క్స్

3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి

మొత్తం పోస్టులు :05

రిక్రూట్మెంట్ :పెర్మనెంట్

విద్య అర్హతలు:

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్:

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుండి B.E / B.Tech / B.Sc / M.Sc (సంబంధిత టెక్నికల్ విభాగంలో) పూర్తి చేసి ఉండాలి.

2. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా (ఇంజనీరింగ్ / టెక్నికల్ ట్రేడ్) పూర్తి చేసి ఉండాలి.

3. సంబంధిత విభాగంలో కనీసం 2 నుండి 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

4.ల్యాబొరేటరీ పరికరాల నిర్వహణ, మెయింటెనెన్స్‌పై అవగాహన ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్స్ :

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత

2. టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి.

ఇంగ్లీష్ టైపింగ్: నిమిషానికి కనీసం 35 పదాలు

లేదా హిందీ టైపింగ్: నిమిషానికి కనీసం 30 పదాలు

3.కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

4. MS Word, Excel, PowerPoint వంటి అప్లికేషన్లపై అవగాహన ఉండాలి.

5. కార్యాలయ పనులు, ఫైల్ హ్యాండ్లింగ్, డేటా ఎంట్రీ పనులపై ప్రాథమిక జ్ఞానం ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత.

2. చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

3. కార్యాలయానికి సంబంధించిన సాధారణ పనులు చేయగల సామర్థ్యం ఉండాలి.

4. శారీరకంగా ఫిట్‌గా ఉండాలి.

వయో పరిమితి:

1. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / EWS / OBC అభ్యర్థులకు రూ 1500/- ఫీజు చెల్లించాలి.

2. SC / ST / PwBD అభర్ధులు రూ 750/- రూపాయలు ఫీజు కట్టాలి.

శాలరీ వివరాలు:

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ :

వేతన స్థాయి (Pay Level): Level-6 / Level-7 ప్రకారం

1. ప్రారంభ జీతం: సుమారు ₹35,400/- నుంచి ₹1,12,400/- వరకు జీతం ఇస్తారు.

2. డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) వంటి ఇతర భత్యాలు వర్తిస్తాయి

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC):

వేతన స్థాయి (Pay Level): Level-2

1. ప్రారంభ జీతం: సుమారు ₹19,900/- నుంచి ₹63,200/- వరకు జీతం ఇస్తారు.

2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):

వేతన స్థాయి (Pay Level): Level-1

1. ప్రారంభ జీతం: సుమారు ₹18,000/- నుంచి ₹56,900/-వరకు జీతం ఇస్తారు.

2. DA, HRA, TA వంటి కేంద్ర ప్రభుత్వ భత్యాలు వర్తిస్తాయి.

3. ఉద్యోగ భద్రత మరియు పెన్షన్ సౌకర్యం ఉంటుంది.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష (Written Test) నిర్వహిస్తారు.

2. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఉంటుంది

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

2.Recruitment / Career సెక్షన్‌కి వెళ్ళండి.

3. నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.

4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించండి.

5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

6. దరఖాస్తు ఫీజు చెల్లించండి.

7. దరఖాస్తును సమర్పించండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 20 మార్చ్ 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *