Information

UGC NET Results 2026 : యూజీసీ -నెట్ ఫలితాలు వచ్చేశాయ్…. స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

calendar_month February 5, 2026 person chitra

UGC NET Results 2026 : యూజీసీ -నెట్ ఫలితాలు వచ్చేశాయ్…. స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

UGC NET Results2026:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన UGC NET పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. యూనివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం పొందాలనుకునే వారు, అలాగే JRF (Junior Research Fellowship) కోసం ప్రయత్నించిన అభ్యర్థులకు ఈ ఫలితాలు ఎంతో కీలకమైనవి. UGC NET పరీక్ష ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఉన్నత విద్యా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు ఫలితాలు విడుదల కావడంతో, అభ్యర్థులు తమ స్కోర్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

UGC -NET ( డిసెంబర్ -2025 ) పరీక్ష ఫలితాలు విడుదల అయినాయి. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన NTA అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు. తాజా గా ఫైనల్ కీ ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు దరఖాస్తు నెంబర్ , పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 9,93,702 మంది రెజిస్ట్రర్ చేసుకోగా, 7, 35,614 మంది అటెండ్ అయినారు . వీరిలో JRF , అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 5,108 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, PHD అడ్మిషన్స్ కి 54,713 మంది , కేవలం PHD కి మాత్రమే 1,17,058 మంది క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు.

UGC NET స్కోర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

UGC NET ఫలితాలు మరియు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

1. ముందుగా UGC NET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. “UGC NET Result / Score Card” లింక్‌పై క్లిక్ చేయాలి.

3. మీ అప్లికేషన్ నంబర్, జన్మతేది ఎంటర్ చేయాలి.

4. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

5. మీ స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. PDF ఫైల్‌గా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

7. ఈ స్కోర్ కార్డు భవిష్యత్తులో ఉద్యోగాల అప్లికేషన్లకు చాలా అవసరం కాబట్టి సురక్షితంగా ఉంచుకోవాలి.

Official Website : Click Here

UGC Score Card Download Link : Click Here

 For Latest Job Updates 

Join Our What’s App Channel: Click Here 

Join Our Telegram Channel : Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *