KVS Jobs : పరీక్ష లేకుండా KVS లో ఉద్యోగాలు… కాంట్రాక్టు టీచర్స్ జాబ్స్ | KVS Recruitment 2026 | Walk In Interview Hyderabad :
KVS Jobs : పరీక్ష లేకుండా KVS లో ఉద్యోగాలు… కాంట్రాక్టు టీచర్స్ జాబ్స్ | KVS Recruitment 2026 | Walk In Interview Hyderabad :
KVS Recruitment 2026:
కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. Kendriya Vidyalaya Sangathan (KVS) ఆధ్వర్యంలో నిర్వహించే కేంద్ర విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ఆధారంగా టీచర్ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడుతున్నారు. ఈ నియామకాలకు రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్ర విద్యాలయాల్లో ఈ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సబ్జెక్టులలో PGT, TGT, PRT, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, యోగా టీచర్, నర్సు, కౌన్సిలర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్టు/పార్ట్ టైం విధానంలో ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో పని చేసే అవకాశం కావడంతో మంచి అనుభవం మరియు గౌరవం లభిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇపుడు చూద్దాం.
KVS Recruitment 2026 Contract Teacher Jobs – అర్హతలు మరియు వయసు వివరాలు:
సంస్థ పేరు: KVS లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
PGT, TGT, PRT, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, యోగా టీచర్, నర్సు, కౌన్సిలర్ వంటి పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హతలు:
PGT (Physics & Economics):
1. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉతీర్ణత ఉండాలి.
2. B.Ed. 50% మార్కులతో లేదా NCTE గుర్తింపు పొందిన ఇంటిగ్రేటెడ్ PG కోర్సు
Trained Graduate Teacher (TGT) – English, Hindi, Sanskrit, Mathematics, Science, Social Science & Telugu:
1. సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో Bachelor/Honours డిగ్రీ
2. B.Ed. 50% మార్కులతో పాస్
3. CTET Paper-II పాస్ తప్పనిసరి.
PRT (Primary Teacher):
1. 12వ తరగతి 50% మార్కులతో ఉతీర్ణత ఉండాలి.
2. 2 సంవత్సరాల D.El.Ed. లేదా 4 సంవత్సరాల B.El.Ed.
3. CTET Paper-I పాస్ తప్పనిసరి.
బాలవాటికా టీచర్:
1. 12వ తరగతి 50% మార్కులతో ఉతీర్ణత
2. 2 సంవత్సరాల Nursery Teacher Education డిప్లొమా లేదా B.Ed (Nursery)
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్:
1. B.E./B.Tech (Computer Science), BCA, MCA, M.Sc (CS)
2. కనీసం 50% మార్కులు ఉండాలి.
స్పోర్ట్స్ కోచ్ / యోగా ఇన్‌స్ట్రక్టర్:
1. సంబంధిత రంగంలో డిప్లొమా లేదా డిగ్రీ 50% మార్కులతో ఉతీర్ణత
2. రాష్ట్ర/జాతీయ స్థాయి అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
ఎడ్యుకేషనల్ కౌన్సెలర్:
1. Psychologyలో B.A./B.Sc./M.A./M.Sc 50% మార్కులతో పాస్
2. Counseling సర్టిఫికెట్/డిప్లొమా
స్పెషల్ ఎడ్యుకేటర్:
1. 12వ తరగతి 50% మార్కులతో ఉతీర్ణత
2. RCI గుర్తింపు పొందిన అర్హత
3. CTET (Primary Stage) పాస్
4. Valid CRR నంబర్
నర్స్:
1. GNM లేదా B.Sc (Nursing)
2. Nursing Council నమోదు తప్పనిసరి.
ఆర్ట్ & క్రాఫ్ట్:
1. Drawing & Painting/Sculpture/Graphic Artలో 5 సంవత్సరాల డిప్లొమా లేదా సమతుల్య డిగ్రీ ఉండాలి.
వయసు పరిమితి:
1. కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
2. గరిష్టంగా 65 సంవత్సరాలు (19-02-2026 నాటికి) ఉండాలి.
జీతం వివరాలు:
1. PGT – నెలకు ₹27,500
2. TGT / కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ / కౌన్సెలర్ – నెలకి ₹26,250 జీతం
3. PRT / స్పోర్ట్స్ / యోగా / ఆర్ట్ / స్పెషల్ ఎడ్యుకేటర్ / బాలవాటికా – నెలకి ₹21,250 జీతం
4. నర్స్ – రోజుకు ₹750 ఇస్తారు.
5. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ ఆధారిత నియామకం మాత్రమే.
6. సెలవుల సమయంలో జీతం చెల్లించరు.
7. TA/DA, LTC వంటి అలవెన్సులు వర్తించవు.
ఎంపిక విధానం:
1. నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ
2. ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
3. అవసరమైతే స్క్రీనింగ్ టెస్ట్ లేదా డెమో క్లాస్
4. అర్హులైన వారిని ప్యానెల్‌లో చేర్చడం.
5. ఖాళీ వచ్చినప్పుడు నియామకం.
6. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు ఎలా చేయాలి?
1. no1uppal.kvs.ac.in లేదా no2 uppal.kvs.ac.in వెబ్‌సైట్ నుండి Bio-data Form డౌన్‌లోడ్ చేయండి.
2. ఫారం పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లు జత చేయండి.
3. మార్క్ షీట్లు, ID ప్రూఫ్, ఫోటోలు సిద్ధం చేసుకోండి.
4. ఇంటర్వ్యూ రోజు ఉదయం 8:30 AM కల్లా హాజరుకావాలి.
5. 9:00 AM – 10:30 AM మధ్య రిజిస్ట్రేషన్ ఉంటుంది.
వెన్యూ వివరాలు:
1. TGT – Kendriya Vidyalaya No.1 Uppal, రామంతాపూర్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్
2. PGT, PRT మరియు ఇతర పోస్టులు – KV No.2 Uppal, GHMC ఆఫీస్ పక్కన
3. అసలు సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలి. ఆధార్, పాన్, వోటర్ ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు చూపించాలి.
ముఖ్యమైన తేదీలు:
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 19 ఫిబ్రవరి 2026
రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 9:00 AM – 10:30 AM
Notification pdf : Click Here
Application Form : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now