Central Govt Jobs

Railway Jobs : రైల్వే శాఖ లో తాజా గా 11,127 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| RRB Assistant Loco Pilot (ALP) Job Recruitment 2026 upcoming Full Details :

calendar_month February 21, 2026 person chitra

Railway Jobs : రైల్వే శాఖ లో తాజా గా 11,127 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| RRB Assistant Loco Pilot (ALP) Job Recruitment 2026 upcoming Full Details :

RRB Assistant Loco Pilot (ALP) Recruitment 2026:

రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. Railway Recruitment Board (RRB) ద్వారా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి అనుమతి మంజూరైంది. వీటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 674 ఖాళీలు ఉన్నాయి.ఈ నియామకాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు 10వ తరగతి (SSC)తో పాటు ITI లేదా సంబంధిత డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశముంది. ఎంపిక ప్రక్రియలో మొదట CBT-1 నిర్వహిస్తారు. అనంతరం CBT-2 జరుగుతుంది. తదుపరి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు మెడికల్ ఎగ్జామినేషన్ (ME) ద్వారా తుది ఎంపిక చేపడతారు.దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Indian Railways ద్వారా తమ అప్లికేషన్ సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Railway Recruitment Board (RRB) లో ఉద్యోగాలు

పోస్టు పేరు : అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)

పోస్టుల వివరాలు:

ఈ రిక్రూట్‌మెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్‌లలో ఖాళీలు ఉన్నాయి:

సెంట్రల్ రైల్వే – 1400

తూర్పు మధ్య రైల్వే – 700

తూర్పు కోస్ట్ రైల్వే – 1625

తూర్పు రైల్వే – 608

నార్త్ సెంట్రల్ రైల్వే – 457

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే – 1276

ఉత్తర రైల్వే – 740

వాయువ్య రైల్వే – 600

దక్షిణ మధ్య రైల్వే – 674

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే – 200

దక్షిణ రైల్వే – 1531

సౌత్ వెస్ట్రన్ రైల్వే – 200

పశ్చిమ మధ్య రైల్వే – 541

పశ్చిమ రైల్వే – 214

చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW) – 66

మొత్తం పోస్టులు : 11,127

ఉద్యోగ రకం: శాశ్వత (Permanent) జాబ్స్

విద్యా అర్హతలు:

అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:

1. మెట్రిక్యులేషన్ / SSC పూర్తి చేసి, NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి ITI (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్ మొదలైన ట్రేడ్లు)

2. సంబంధిత ట్రేడ్‌లో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయాలి.

3. మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.

వయోపరిమితి:

1. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / OBC / EWS అభ్యర్థులు – ₹500/- రూపాయలు

2. SC / ST / PwBD అభ్యర్థులు – ₹250/- ఫీజు చెల్లించాలి.

3. ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.

జీతం వివరాలు:

అభ్యర్థులకు నెల జీతం పోస్ట్ ను అనుసరించి రూ₹19,900/- నుంచి ₹63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

ఎంపిక ప్రక్రియ ఈ క్రింది దశల్లో జరుగుతుంది:

1. CBT – 1

2. CBT – 2

3. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)

5. మెడికల్ ఎగ్జామినేషన్ (ME)

6. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ వివరాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటించబడతాయి.

7. పరీక్ష కేంద్రం, తేదీ మార్పు అభ్యర్థనలు స్వీకరించబడవు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ Indian Railways (https://indianrailways.gov.in/) ఓపెన్ చేయాలి.

2. హోమ్ పేజీలో “RRB ALP Recruitment 2026” నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

3. ముందుగా New Registration పై క్లిక్ చేసి, మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేయాలి.

4. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్‌లో అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.

5. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సంతకం, విద్య సర్టిఫికేట్లు) అప్లోడ్ చేయాలి.

6. మీ కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు ఆన్లైన్‌లో చెల్లించాలి.

7. అన్ని వివరాలు సరిచూసుకుని Submit బటన్‌పై క్లిక్ చేయాలి.

8. చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాలకు ఉంచుకోవాలి.

దరఖాస్తు ప్రారంభం : Coming Soon

దరఖాస్తుచివరి తేదీ : Coming Soon

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Indian Railways ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

Notification Pdf Click Here

Old Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *