Central Govt Jobs

HPCL లో Graduate Apprentice Trainees Recruitment 2026 | 250 పోస్టులు | ₹25,000 స్టైపెండ్ | Apply Online:

calendar_month March 4, 2026 person chitra

HPCL లో Graduate Apprentice Trainees Recruitment 2026 | 250 పోస్టులు | ₹25,000 స్టైపెండ్ | Apply Online:

HPCL Recruitment 2026:

హాయ్ ఫ్రెండ్స్ … నిరుద్యోగులకు శుభవార్త….ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ట్రైనింగ్ చేసే అద్భుత అవకాశం వచ్చింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి. ఒక సంవత్సరం పాటు రిఫైనరీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుని పరిశ్రమ అనుభవం పొందే మంచి ఛాన్స్ ఇది. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

HPCL గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ నియామకాలు 2026-27 ముఖ్య వివరాలు:

సంస్థ పేరు: Hindustan Petroleum Corporation Limited లో ఉద్యోగాలు

పోస్టు పేరు: Graduate Apprentice Trainees పోస్టులు

ఖాళీల వివరాలు :

ముంబై రిఫైనరీ – మహారాష్ట్ర – 120

విశాఖ రిఫైనరీ – ఆంధ్రప్రదేశ్ – 130

మొత్తం ఖాళీలు: 250

విద్య అర్హతలు:

1. BE / BTech పూర్తి చేసి ఉండాలి.

2. 01-04-2023 తర్వాత పాస్ అయ్యి ఉండాలి.

3. సంబంధిత బ్రాంచ్‌లు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, IT

కనీస మార్కులు:

సాధారణ వర్గం: 60%

SC/ST/PwBD: 50% ఉతీర్ణత ఉండాలి.

వయస్సు పరిమితి:

1. కనీసం: 18 సంవత్సరాలు , గరిష్టం: 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC/ST వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్

3. OBC వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది.

4. భారతీయ పౌరులు మాత్రమే అప్లై చేయాలి. ముందుగా NATS 2.0 పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

దరఖాస్తు రుసుము:

1. అప్లికేషన్ ఫీజు లేదు.

2. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు సమర్పిస్తే అవి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

స్టైపెండ్ వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹25,000 స్టైపెండ్ అందించబడుతుంది.

2. ₹20,500 – కంపెనీ నుంచి

3. ₹4,500 – ప్రభుత్వం DBT ద్వారా ఈ స్టైపెండ్ ఒక సంవత్సరం పాటు చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం:

1. ఈ నియామకంలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

2. డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ షార్ట్‌లిస్టింగ్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్

5. మంచి అకడమిక్ మార్కులు ఉన్న అభ్యర్థులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అప్లై చేసే విధానం:

1. ముందుగా NATS 2.0 పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.

2. BOAT ద్వారా అప్రూవల్ పొందాలి.

3. తర్వాత HPCL అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్‌లో సైన్ అప్ చేయాలి.

4. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.

5. ముంబై లేదా విశాఖ లొకేషన్‌లో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేయాలి.

6. ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి.

7. ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం: 25 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 10 మార్చ్ 2026

Notification pdf : Click Here

Apply Now : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *