AP Job Calendar 2026 Release: 10,060 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ విడుదల:
AP Job Calendar 2026 Release: 10,060 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ విడుదల:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉగాది సందర్భంగా మొత్తం 10,060 పోస్టులతో AP Job Calendar 2026 ను నేడు విడుదల చేసింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది.
యువగళం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో 9,000 పైగా పోస్టులు భర్తీ చేసిన విషయం తెలిసిందే.
AP Job Calendar 2026లో పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ శాఖల్లో మొత్తం 10,060 పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఉన్నత విద్యాశాఖ పోస్టులు:
మొత్తం పోస్టులు: 1,500
నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 15, 2026
గ్రూప్-1, హోమ్ శాఖ & ఇతర పోస్టులు:
గ్రూప్-1 పోస్టులు: 91
హోమ్ శాఖ పోస్టులు: 2,778
ఇతర శాఖలు: 928
నోటిఫికేషన్ విడుదల తేదీ: ఆగస్టు 15, 2026
గ్రూప్-2 & ఇంజనీరింగ్ పోస్టులు:
గ్రూప్-2 పోస్టులు: 750
ఇంజనీరింగ్ (AEE) పోస్టులు: 503
ఇతర పోస్టులు: 506
నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2026
పాఠశాల & ఇంటర్ విద్య పోస్టులు:
మొత్తం పోస్టులు: 3,004
నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 15, 2026

For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now