రాత పరీక్ష , ఫీజు లేకుండా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయంలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 – 42 బ్యాక్‌లాగ్ పోస్టులు..వెంటనే అప్లై చేసుకోండి.
రాత పరీక్ష , ఫీజు లేకుండా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయంలో ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 – 42 బ్యాక్‌లాగ్ పోస్టులు..వెంటనే అప్లై చేసుకోండి.
AP Collector Office Jobs 2026 – కలెక్టర్ కార్యాలయంలో 42 బ్యాక్‌లాగ్ పోస్టులు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం నుండి 2025-26 సంవత్సరానికి సంబంధించిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) కోసం మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేదు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, ప్రకాశం జిల్లా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ అసిస్టెంట్ – 2
2. టైపిస్ట్ – 8
3. MPHA (Female) – 1
4. ANM (Grade III) – 1
5. ఫిషర్‌మెన్ – 1
6. ఆఫీస్ సబార్డినేట్ – 13
7. మెసెంజర్ – 1
8. సానిటరీ మేస్త్రీ – 1
9. వాచ్‌మెన్ – 10
10.స్వీపర్ – 1
11. PH వర్కర్ – 2 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 42
ఉద్యోగ రకం: రెగ్యులర్
అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
విద్య అర్హతలు :
1. కనీసం స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
2. లేదా 5వ తరగతి / 7వ తరగతి / 10వ తరగతి.
3. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రత్యేక వర్గాలకు గరిష్టంగా 10 సంవత్సరాల వయస్సు సడలింపు (52 సంవత్సరాలు వరకు) ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు ₹15,000 నుండి ₹34,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1.మెరిట్ ఆధారిత ఎంపిక:
గ్రూప్–4 (DSC)లో పేర్కొన్న పోస్టులకు అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
2.ప్రావీణ్యత పరీక్ష:
జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత Office Automation పరీక్ష తప్పనిసరి.
3. సమాన మెరిట్ పరిస్థితి:
మెరిట్ సమానంగా ఉన్నప్పుడు అధిక అంగవైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
4. క్లాస్-IV పోస్టుల ఎంపిక:
క్లాస్-IV పోస్టులకు వయస్సు, అంగవైకల్యం మరియు ఎంప్లాయిమెంట్ సీనియారిటీ ఆధారంగా మెరిట్ నిర్ణయిస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. పూర్తిగా నింపిన దరఖాస్తులను విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ప్రకాశం భవన్, కలెక్టరేట్ కాంపౌండ్, ఒంగోలు కార్యాలయానికి సమర్పించాలి.
3. విభిన్న ప్రతిభావంతుల కేటగిరీ ప్రకారం పోస్టులు ఈ విధంగా ఉన్నాయి: అంధులకు 21 పోస్టులు, బదిరులకు 10 పోస్టులు, శారీరక వైకల్యం గల వారికి 4 పోస్టులు, అలాగే ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక అనారోగ్యం మరియు బహుళ వైకల్యాల కేటగిరీలకు 7 పోస్టులు కేటాయించబడ్డాయి.
4. ఈ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి విడివిడిగా దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
5. దరఖాస్తు సమర్పణ గడువు: 08.04.2026 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 18 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 08 ఏప్రిల్ 2026
Notification pdf : Click Here
Application pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now