LPG Refill Booking Timelines: గ్యాస్ బుకింగ్ టైమింగ్లో మార్పులపై కేంద్రం క్లారిటీ:
LPG Refill Booking Timelines: గ్యాస్ బుకింగ్ టైమింగ్లో మార్పులపై కేంద్రం క్లారిటీ:
LPG Refill Booking Timelines 2026 Telugu:
గ్యాస్ సిలిండర్ బుకింగ్ టైమింగ్లో మార్పులు జరిగాయనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, LPG రీఫిల్ బుకింగ్ గడువులను మార్చారనే వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం అని వెల్లడించింది. మార్చి 25న అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేసి, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
LPG బుకింగ్ గడువులపై అసలు నిజం ఏమిటి?
కొన్ని వార్తా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టులు ప్రకారం కొత్తగా ఇలా గడువులు నిర్ణయించారని ప్రచారం జరిగింది:
1. PMUY కనెక్షన్లకు – 45 రోజులు
2. Non-PMUY Single Bottle – 25 రోజులు
3. Non-PMUY Double Bottle – 35 రోజులు
4. కానీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏమిటంటే ఇలాంటి మార్పులు ఏవీ చేయలేదు.
ప్రస్తుతం అమల్లో ఉన్న LPG బుకింగ్ గడువులు:
ప్రస్తుతం కొనసాగుతున్న గడువులు ఇవే:
పట్టణ ప్రాంతాలు – 25 రోజులు
గ్రామీణ ప్రాంతాలు – 45 రోజులు
కనెక్షన్ రకం (Single/Double/PMUY) తో సంబంధం లేకుండా ఈ గడువులు వర్తిస్తాయి.
ప్రజలకు కేంద్రం సూచనలు:
1. తప్పుడు వార్తలను నమ్మకండి.
2. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను షేర్ చేయకండి.
3. అవసరం లేకుండా ముందుగానే గ్యాస్ బుకింగ్ చేయవద్దు.
4. ఎలాంటి సందేహాలు ఉంటే అధికారిక వనరులనే నమ్మండి.
LPG నిల్వలపై ముఖ్య సమాచారం:
దేశంలో ప్రస్తుతం సరిపడా LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాబట్టి గ్యాస్ కొరతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది.
Clarification on News Reports Regarding LPG Refill Booking Timelines
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now