సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల… ఇలా డౌన్ లోడ్ చేసుకోండి?| AISSEE 2026 Admit Cards Download Here :

సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల… ఇలా డౌన్ లోడ్ చేసుకోండి?| AISSEE 2026 Admit Cards Download Here :

AISSEE 2026 Admit Cards Download Here:

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకమైన సైనిక్ స్కూల్స్‌లో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించనున్న AISSEE (All India Sainik Schools Entrance Examination) 2026 కు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ విడుదలయ్యాయి. 6వ తరగతి మరియు 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ నెల 18 న జరగనున్న ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ( AISSEE 2026) అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యాయి. అంతేకాకుండా ఇటీవల అడ్వాన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల చేసిన NTA Monday సాయంత్రం అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు వెబ్సైటు లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్,సెక్యూరిటీ పిన్, ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్స్ పొందవచ్చు. దేశ వ్యాప్తంగా 464 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహణ కి NTA ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే 011-40759000 లేదా 011-69227700 నంబర్స్ ను లేదా aissee@nta.ac.in ద్వారా అభ్యర్థులు సంప్రదించవచ్చు. ఈ పరీక్ష ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 6 నుంచి 9 తరగతులకు ప్రవేశాలను కల్పిస్తున్నారు.

AISSEE 2026 పరీక్ష వివరాలు:

AISSEE 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.

1. 6వ తరగతి ప్రవేశానికి గణితం, భాష, ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

2. 9వ తరగతి ప్రవేశానికి గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

3. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ ఛాయిస్ సమాధానాలు ఉంటాయి.

AISSEE 2026 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

క్రింది స్టెప్స్‌ను అనుసరించి సులభంగా AISSEE 2026 అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in ను ఓపెన్ చేయండి

2. హోమ్ పేజీలో “AISSEE 2026 Admit Card” లింక్‌పై క్లిక్ చేయండి.

3. అప్లికేషన్ నంబర్, జన్మ తేదీ వివరాలు నమోదు చేయండి.

4. Submit బటన్‌పై క్లిక్ చేయండి.

5. మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

For Admit Cards Download Link : Click Here

Leave a Comment