AP Schools

AP 10th Exams 2026 : AP లో మారిన పదవ తరగతి ఎగ్జామ్స్ టైం టేబుల్…. ఇలా తెలుసుకోండి!

calendar_month February 9, 2026 person chitra

AP 10th Exams 2026 : AP లో మారిన పదవ తరగతి ఎగ్జామ్స్ టైం టేబుల్…. ఇలా తెలుసుకోండి!

AP 10th exam schedule 2026 revised:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చాలా ముఖ్యమైన సమాచారం ఇది. AP SSC Exams 2026 కు సంబంధించిన కొత్త ఎగ్జామ్ టైం టేబుల్ మార్పులు విద్యాశాఖ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పరీక్షలు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రూపంలో నిర్వహించనున్నారు. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే విడుదల ఐన పరీక్షల షెడ్యూల్ లో కొన్ని చిన్న మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మార్చ్ 16 వ తేదీన ప్రారంభం కానున్నాయి.

AP SSC Exam Time Table 2026 లో చేసిన మార్పులు:

ఈ ఏడాది క్యాలెండరు ప్రకారం ఉగాది పండగ మార్చ్ 20 వ తేదీ వస్తోంది. ఆరోజు నిర్వహించాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మార్చ్ 20 న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష మార్చ్ 21 న నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పును ప్రతి ఒక్క విద్యార్థి గమనించాలి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తున్నారు, పరీక్ష సమయాలలో ఎలాంటి మార్పులు లేవు.

మారిన EXAM Time Table :

మార్చ్ 16 – ఫస్ట్ లాంగ్వేజ్

మార్చ్ 18 – సెకండ్ లాంగ్వేజ్

మార్చ్ 21 – ఇంగ్లీష్ ( మార్చ్ 20 నుంచి మారింది)

మార్చ్ 23 – మ్యాథెమటిక్స్

మార్చ్ 25 – ఫీజికల్ సైన్స్

మార్చ్ 28 – బయలాజికల్ సైన్స్

మార్చ్ 30 – సోషల్ స్టడీస్

విద్యార్థులు మారిన షెడ్యూల్ ను అనుసరించి తమ రివిజన్ ప్లాన్ చేసుకోవాలని విద్య శాఖ సూచించింది.

Revised Time Table 2026 pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *