AP Half Day School 2026 : ఒంటిపూట బడుల టైమింగ్స్ మార్పులు – పూర్తి వివరాలు:
AP Half Day School 2026 : ఒంటిపూట బడుల టైమింగ్స్ మార్పులు – పూర్తి వివరాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల పనివేళలను మార్చుతూ ఒంటిపూట బడులు (Half Day Schools) నిర్వహించాలని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మార్పులు మార్చి 16, 2026 నుండి అమల్లోకి వస్తాయి.
AP Half Day School 2026 – ఒంటిపూట బడుల టైమింగ్స్ :
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 16 నుండి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.
పాఠశాల ప్రారంభం : ఉదయం 7:45 గంటలకు
తరగతులు ముగింపు : మధ్యాహ్నం 12:30 గంటలకు
ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తిస్తాయి.
విద్యాశాఖ ఆదేశాలు:
విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అన్ని పాఠశాలలు ఒంటిపూట బడుల విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి.
AP Half Day School 2026 Food Scheme – రాగి జావా మరియు మధ్యాహ్న భోజనం:
ప్రభుత్వ పాఠశాలల్లో అమలులో ఉన్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉదయం : రాగి జావా అందజేస్తారు
మధ్యాహ్నం : మధ్యాహ్న భోజనం (Mid Day Meal) కొనసాగుతుంది.
10వ తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:
1. 10వ తరగతి పరీక్షల కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ప్రత్యేక షెడ్యూల్ ఉంటుంది.
2. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదనపు కార్యకలాపాలు లేదా తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఒంటిపూట బడులు ఎప్పటి వరకు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 16 నుండి ఏప్రిల్ 23, 2026 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
AP 10th Class Exams 2026:
ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026 నుండి ప్రారంభమవుతున్నాయి.
పరీక్ష సమయం : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది.
వేసవి సెలవులు:
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవులు కూడా ఖరారయ్యాయి.
వేసవి సెలవులు : ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు హాలిడేస్ ఉంటాయి.
తిరిగి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం : జూన్ 12, 2026
ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కొత్త టైమింగ్స్‌ను గమనించి పాఠశాలకు హాజరు కావాలని విద్యాశాఖ సూచించింది.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now