AP TET 2025 :ప్రాథమిక కీ విడుదల తేదీ పై లేటెస్ట్ అప్డేట్ | AP TET 2025 Exam Key Release Date:
AP TET 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన AP TET 2025 పరీక్షలు ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతూ తమ ఉపాధ్యాయ వృత్తి కలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ సారి జరుగుతున్న TET పరీక్షల కోసం మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో, అభ్యర్థులంతా ముఖ్యంగా ఎదురుచూస్తున్న అంశం AP TET 2025 Answer Key (ప్రాథమిక కీ) గురించే.
AP TET పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 10 వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాగా, ఈ నెల 21 వ తేదీ తో అన్ని subjects పేపర్స్ పూర్తి అవుతాయి. అయితే ఈ పరీక్షకు సంబందించిన ప్రాథమిక కీ మాత్రం 2 జనవరి తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ఈ టెట్ పరీక్షల్లో అర్హత సాధిస్తేనే DSCcరాసేకి వీలు ఉంటుంది. అంతే కాదు ప్రైవేట్ స్కూల్ లో పని చేయడానికి కూడా ఈ టెట్ అర్హత తప్పనిసరి.
AP TET 2025 కీ ఎప్పుడు విడుదల అవుతుంది?
ఆధికారిక నోటిఫికేషన్ ప్రకారం, AP TET 2025 ప్రాథమిక Answer Key ను జనవరి 2026 మొదటి వారంలో విడుదల చేయనున్నారు. పరీక్షలన్నీ పూర్తైన తర్వాత, పేపర్–1 మరియు పేపర్–2 కు సంబంధించిన కీలు విడివిడిగా విడుదల చేస్తారు. ఈ ప్రాథమిక కీ ద్వారా అభ్యర్థులు తమ సమాధానాలను సరిపోల్చుకొని అంచనా మార్కులను లెక్కించుకోవచ్చు.
2026 january 2వ తేదీన APTET ఎగ్జామ్స్ ప్రాథమిక కీ విడుదల అవుతుంది. జనవరి 2 నుంచి 9 వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 13 న ఫైనల్ కీ అందుబాటులోకి వస్తుంది. విద్యా శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 19 న APTET ఫలితాలు ప్రకటిస్తారు.
అభ్యంతరాల (Objections) అవకాశం:
ప్రాథమిక కీ విడుదలైన తర్వాత, అభ్యర్థులకు అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పిస్తారు. కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని భావించిన అభ్యర్థులు, నిర్ణీత గడువులోపు సంబంధిత ఆధారాలతో ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, నిపుణుల కమిటీ అభ్యంతరాలను పరిశీలించి Final Answer Key ను విడుదల చేస్తుంది.
ఫైనల్ కీ మరియు ఫలితాలు:
అభ్యంతరాల పరిశీలన అనంతరం, Final Answer Key విడుదల చేస్తారు. ఈ ఫైనల్ కీ ఆధారంగానే AP TET 2025 ఫలితాలు సిద్ధం చేయబడతాయి. అధికారిక సమాచారం ప్రకారం, జనవరి 2026 మధ్యలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ద్వారా స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్:
AP TET 2025 కు సంబంధించిన అన్ని కీలక అప్‌డేట్స్, కీ, ఫలితాలు వంటి వివరాలు అధికారిక వెబ్‌సైట్ https:// tet2dsc.apcfss.in లో మాత్రమే ప్రకటిస్తారు. అందువల్ల అభ్యర్థులు ఫేక్ న్యూస్‌కి దూరంగా ఉండి, అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయడం మంచిది.
మరో సరి AP TET కోసం సిద్ధం అయ్యే అభ్యర్థుల కోసం మాక్ టెస్టులు ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tet2dsc.apcfss.in లోకి వెళ్లి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవడం తో పాటు మాక్ టెస్ట్ లు కూడా రాసుకోవచ్చు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
1. పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రశాంతంగా ఉండాలి.
2.సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మకూడదు.
3.కీ విడుదలైన వెంటనే జాగ్రత్తగా సమాధానాలు సరిపోల్చుకోవాలి.
4.అభ్యంతరాలు ఉంటే తప్పకుండా నిర్ణీత గడువులోపు నమోదు చేయాలి.
5.ఫలితాల కోసం అధికారిక ప్రకటన వరకు ఓర్పుగా వేచి చూడాలి.