AP Jobs : APSRTC లో డ్రైవర్ , కండక్టర్ 7,673 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| APSRTC Jobs Notification 2026 Apply Now :
APSRTC Jobs Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,673 డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. APSRTC అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ రవాణా సంస్థ. స్థిరమైన ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు ఉండటంతో APSRTC ఉద్యోగాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ( APSRTC ) నుంచి 7,673 పోస్టులను భర్తీ చేయనున్నారు. బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో డ్రైవర్ పోస్టులు 3673, కండక్టర్ 1813 పోస్టులు, మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా అభ్యర్థులు పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
APSRTC పోస్టుల వివరాలు – ముఖ్య వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య భారీగా ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జిల్లాల వారీగా పోస్టుల విభజన కూడా ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు తమకు సమీపంలోని డిపోలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.
సంస్థ పేరు: APSRTC లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. డ్రైవర్
2. కండక్టర్
3. మెకానిక్
4. శ్రామిక పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 7,673
విద్య అర్హతలు:
డ్రైవర్ పోస్టులకు అప్లై చేయాలంటే:
1. అభ్యర్థి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2. హెవీ మోటార్ వెహికిల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
3. నిర్దిష్ట సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం అవసరం
కండక్టర్ పోస్టులకు:
1. కనీస విద్యార్హత 10వ తరగతి లేదా ఇంటర్ / ITI అర్హత కలిగి ఉండాలి.
2. ప్రాథమిక లెక్కలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
వయో పరిమితి:
1. APSRTC ఉద్యోగాలకు అప్లై చేయాలంటే సాధారణంగా అభ్యర్థి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC, ST, BC, EWS అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
APSRTC డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీ ఆధారంగా క్రింది విధంగా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
1. సాధారణ / OBC అభ్యర్థులు: ₹500/-
2. SC / ST / BC / EWS అభ్యర్థులు: ₹250/-
3. మహిళా అభ్యర్థులు: ₹250/- ఫీజు చెల్లించాలి.
4. దరఖాస్తు రుసుమును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలి.
శాలరీ వివరాలు:
1. APSRTC డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలకు మంచి వేతనం ఉంటుంది. ప్రారంభ వేతనం పోస్టును బట్టి నెలకు ₹20,000 – ₹40,000 వరకు ఉంటుంది.
2. అదనంగా, డీఏ (DA), హెచ్ఆర్ఏ (HRA), మెడికల్ సదుపాయాలు, పీఎఫ్, పెన్షన్ లాంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
APSRTC Jobs Notification 2026 లో ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉండవచ్చు:
1. రాత పరీక్ష (Written Test)
2. డ్రైవింగ్ టెస్ట్ (డ్రైవర్ పోస్టులకు) ఉంటుంది.
3. ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. APSRTC ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది.
2. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు:
విద్యార్హత సర్టిఫికెట్లు
వయస్సు ధృవీకరణ పత్రం
డ్రైవింగ్ లైసెన్స్ (డ్రైవర్ పోస్టులకు) అప్లోడ్ చేయాలి.
Note : APSRTC లో ఖాళీలను మాత్రమే విడుదల చేసింది. నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు . యాజమాన్యం బుధవారం జరిగే AP క్యాబినెట్ లో ఈ ఉద్యోగాల భర్తీ పైన తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.AP క్యాబినెట్ అనుమతి ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది.
APSRTC Jobs Update : Click Here
Official Website : Click Here