CBSE 10th 12th పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల…. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. | CBSE Admit Cards Released 2026 :
CBSE 10th 12th పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల…. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. | CBSE Admit Cards Released 2026 :
CBSE 10th 12th Admit Card 2026 విడుదల :
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షల అడ్మిట్ కార్డ్స్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డ్స్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. అందుకే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తన అడ్మిట్ కార్డ్‌ను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు CBSE బోర్డు పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో CBSE బోర్డు పరీక్షల నిర్వహణను సజావుగా జరిపేందుకు అడ్మిట్ కార్డ్స్‌ను ముందుగానే విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డ్స్‌లో విద్యార్థి పేరు, రోల్ నెంబర్, పరీక్షా కేంద్రం వివరాలు, పరీక్ష తేదీలు మరియు సమయాలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
CBSE 10th & 12th అడ్మిట్ కార్డ్ ముఖ్యమైన వివరాలు:
సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) 10th , 12th తరగతి పరీక్షల అడ్మిట్ కార్డ్స్ విడుదల అయినాయి. CBSE 10th క్లాస్ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చ్ 11 వరకు జరుగుతాయి. అలాగే 12th తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. దీనితో అధికారులు మంగళవారం హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ ను అందుబాటులో తీసుకొచ్చారు. పరీక్ష సంగం పోర్టల్ లో లాగిన్ కావడం ద్వారా ఆయా పాఠశాలలు రెగ్యులర్ విద్యార్థులు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూసర్ ID , పాస్ వర్డ్స్ , సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి వీటిని పొందవచ్చు.
CBSE Admit Card 2026 డౌన్లోడ్ చేసే విధానం:
1. ముందుగా CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. “Pariksha Sangam” లేదా “Schools Login” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. స్కూల్ యూజర్ ఐడి, పాస్వర్డ్ నమోదు చేయండి.
4. “CBSE Admit Card 2026” లింక్‌ను ఎంచుకోండి.
5. విద్యార్థి వివరాలను వెరిఫై చేయండి.
6. అడ్మిట్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
Admit Card Download Link : Click Here