AP Jobs

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| Latest CCRS Recruitment 2026 Full Details :

calendar_month February 7, 2026 person chitra

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| Latest CCRS Recruitment 2026 Full Details :

Latest CCRS Recruitment 2026:

CCRS (Central Council for Research in Siddha) అనేది భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సంశోధన సంస్థ. ఇది సిధ్ధ వైద్యంలో శాస్త్రీయ పరిశోధనలు, క్లినికల్ మరియు ప్రయోగాత్మక కార్యాచరణలపై పని చేస్తుంది. దీనిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. CCRS Recruitment 2026 నోటిఫికేషన్లో వివిధ పోస్టులు కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. వాటిలో రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, మెడికల్ లాబరేటరీ, టెక్నాలజిస్ట్ & లాబొరేటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.

ఇందులో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి. 10th , any డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి గల వారు 01 ఏప్రిల్ 2026 లోపు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు & ఖాళీలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Central Council for Research in Siddha ( CCRS) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. రీసెర్చ్ ఆఫీసర్

2. రీసెర్చ్ అసిస్టెంట్

3. మెడికల్ లాబొరేటరీ

4. టెక్నాలజిస్ట్ & లాబరేటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 14

రిక్రూట్మెంట్ విధానం: పెర్మనెంట్ ఉద్యోగాలు

విద్య అర్హతలు:

రీసెర్చ్ ఆఫీసర్ (Research Officer – Siddha):

1. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తప్పనిసరి.

ఉదాహరణకు:

MD (Siddha) /

Post Graduate Degree in Siddha Medicine

2. ప్రభుత్వ / గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణత ఉండాలి.

3. సంబంధిత రంగంలో పరిశోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

రీసెర్చ్ అసిస్టెంట్ :

1. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్

2. సాధారణంగా అంగీకరించే అర్హతలు:

B.Sc / M.Sc (Chemistry / Botany / Biology)

3. ప్రయోగశాల (Laboratory) అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.

4. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చదివి ఉండాలి.

మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ :

1. డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (DMLT / BMLT) లేదా B.Sc (Medical Laboratory Technology)

2. ప్రభుత్వ / గుర్తింపు పొందిన సంస్థ నుండి కోర్సు పూర్తి చేసి ఉండాలి.

3. ల్యాబ్‌లో పని చేసిన అనుభవం ఉంటే మంచి అవకాశం.

లాబొరేటరీ అటెండెంట్ :

1. కనీస విద్యార్హత 10వ తరగతి (SSC) లేదా ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణత.

2. ప్రయోగశాల లేదా ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం.

3. శారీరకంగా ఫిట్‌గా ఉండాలి.

వయో పరిమితి:

రీసెర్చ్ ఆఫీసర్ (Research Officer):

కనీస వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

రీసెర్చ్ అసిస్టెంట్ (Research Assistant):

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT):

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

లాబొరేటరీ అటెండెంట్ :

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయస్సు సడలింపు:

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది:

SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

PwBD (దివ్యాంగులు) – 10 సంవత్సరాలు

Ex-Servicemen – ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. సాధారణ / OBC అభ్యర్థులు దరఖాస్తు ఫీజు: ₹300/-

ఫీజు చెల్లింపు విధానం:

ఆన్‌లైన్ (డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్)

లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా చెల్లించాలి.

2. SC / ST / మహిళా అభ్యర్థులు / దివ్యాంగులు (PwBD) దరఖాస్తు ఫీజు: లేదు (ఫీజు మినహాయింపు) ఉంటుంది.

జీతం వివరాలు:

1. రీసెర్చ్ ఆఫీసర్ :

పే లెవల్: Level – 10 (7th Pay Commission) ప్రకారం నెలకు సుమారు ₹56,100 – ₹1,77,500 వరకు జీతం ఇస్తారు.

ఇతర ప్రయోజనాలు:

DA (Dearness Allowance)

HRA / TA

మెడికల్ సౌకర్యాలు

పెన్షన్ & ఇతర కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ ఉంటాయి.

రీసెర్చ్ అసిస్టెంట్ (Research Assistant):

1. పే లెవల్: Level – 6 నెలకు సుమారు ₹35,400 – ₹1,12,400 వరకు జీతం ఇస్తారు.

2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో అన్ని అలవెన్సులు వర్తిస్తాయి

మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ :

1. పే లెవల్: Level – 5 నెలకు సుమారు ₹29,200 – ₹92,300 వరకు జీతం ఇస్తారు.

2. DA, HRA, మెడికల్ అలవెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి.

లాబొరేటరీ అటెండెంట్ :

పే లెవల్: Level – 1 ప్రకారం నెలకు సుమారు ₹18,000 – ₹56,900 మధ్య జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

1. దరఖాస్తుల పరిశీలన

2. రాత పరీక్ష / స్కిల్ టెస్ట్

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

5. చివరి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయండి.

2. దరఖాస్తు ఫారం పొందండి.

3. దరఖాస్తు ఫారం నింపండి.

4. అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి.

5. దరఖాస్తు రుసుము చెల్లింపు చేయండి.

6. దరఖాస్తు పంపే చిరునామా:

The Director General,
Central Council For Research in Siddha,
Ministry Of Ayush,
GST Road,
Tambaram Sanatorium,
Chennai- 600047.

6. చివరి తేదీ లోపు పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31 జనవరి 2026

ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 01 ఏప్రిల్ 2026

Notification & Application pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *