Central Govt Jobs

Latest Jobs 2026: 10వ తరగతి అర్హతతో MTS, క్లర్క్ ఉద్యోగాలు | Chief Quality Assurance Establishment (MS) Recruitment 2026:

calendar_month March 1, 2026 person chitra

Latest Jobs 2026: 10వ తరగతి అర్హతతో MTS, క్లర్క్ ఉద్యోగాలు | Chief Quality Assurance Establishment (MS) Recruitment 2026:

భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Chief Quality Assurance Establishment (MS) (CQAE-MS) నుండి గ్రూప్ “C” కేటగిరీలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), సూపరింటెండెంట్ (స్టోర్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.

10వ తరగతి లేదా 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది.

సంస్థ వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Chief Quality Assurance Establishment (MS) లో ఉద్యోగాలు

ఉద్యోగ రకం: శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు: 10

అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్

పోస్టుల వివరాలు:

1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

3. సూపరింటెండెంట్ (స్టోర్స్) పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

MTS:

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.

LDC:

1. 12వ తరగతి ఉత్తీర్ణత.

టైపింగ్ స్పీడ్:

2. ఇంగ్లీష్ – నిమిషానికి 35 పదాలు

3. హిందీ – నిమిషానికి 30 పదాలు

Superintendent (Stores):

1. 10+2 లేదా సమాన అర్హత

2. మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్ కోర్సు & సంబంధిత అనుభవం

వయోపరిమితి:

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది

జీతం వివరాలు:

MTS: రూ.18,000 – 50,000/- నెలకు salary

LDC: రూ.19,000 – 63,200/-

Superintendent (Stores): రూ.25,500 – 81,000/-

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

1. అధికారిక నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఫారమ్‌లో అవసరమైన వివరాలు సరిగా నింపాలి.

3. అవసరమైన సర్టిఫికెట్ల ప్రతులను జత చేయాలి.

4. కవరుపై “APPLICATION FOR THE POST OF ______” అని స్పష్టంగా రాయాలి.

5. రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా క్రింది చిరునామాకు పంపాలి.

చిరునామా:

The Chief Quality Assurance Officer (MS)
7th Floor, NMRL/DGQA Building,
Near Tiger Gate, Naval Dockyard,
Mumbai – 400001

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 27 మార్చ్ 2026

Notification Pdf : Click Here

Official Website: Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *