కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల …వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | CSIR CCMB Recruitment 2026:

కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల …వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | CSIR CCMB Recruitment 2026:

CSIR CCMB Recruitment 2026:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. CSIR – CCMB (Centre for Cellular and Molecular Biology) సంస్థ నుండి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ 2026 సంవత్సరానికి విడుదలైంది. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. స్థిరమైన ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలు ఈ ఉద్యోగంలో లభిస్తాయి.

భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద CSIR – సెంటర్ ఫార్ సెల్యూలార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ ( CSIR -CCMB )లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్,& టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 10th , ITI , 12th , డిప్లొమా,లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు వయస్సు కూడా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

CCMB నోటిఫికేషన్ పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: CSIR – సెంటర్ ఫార్ సెల్యూలార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. టెక్నీషియన్ – 50 పోస్టులు

2. టెక్నికల్ అసిస్టెంట్ – 25

3.టెక్నికల్ ఆఫీసర్ – 05 ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 80

రిక్రూట్మెంట్ విధానం: పెర్మనెంట్

విద్య అర్హతలు:

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు సంబంధిత విభాగంలో

1. డిప్లొమా / B.Sc / B.Tech / గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

2. కొన్ని పోస్టులకు అనుభవం అవసరం ఉండవచ్చు.

వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం వివరాలు:

CSIR CCMB టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతం అందిస్తారు.

1. టెక్నీషియన్ – ₹ 39,545/-

2. టెక్నికల్ అసిస్టెంట్ – ₹72,240/-

3. టెక్నికల్ ఆఫీసర్ – ₹ 90,100/- రూపాయలు నెలకి జీతం ఇస్తారు.

4. DA, HRA, TA వంటి ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

దరఖాస్తు రుసుము:

CSIR CCMB Recruitment 2026 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కేటగిరీ ఆధారంగా దరఖాస్తు రుసుము చెల్లించాలి.

1.జనరల్ / OBC / EWS అభ్యర్థులు: ₹500/-

2.SC / ST / PwBD / మహిళా అభ్యర్థులు: రుసుము లేదు (Fee Exempted)

3.దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలోనే (డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ద్వారా) చెల్లించాలి.

4. ఒకసారి చెల్లించిన ఫీజు రిఫండ్ చేయబడదు.

ఎంపిక విధానం:

ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:

1.రాత పరీక్ష (Written Test)

2.ట్రేడ్ / స్కిల్ టెస్ట్ (అవసరమైతే)

3.డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. ఇంటర్వ్యూ

5. అభ్యర్థులు రాత పరీక్షకు మంచి ప్రిపరేషన్ చేయాలి. టెక్నికల్ సబ్జెక్ట్స్‌తో పాటు జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, బేసిక్ మాథ్స్ వంటి అంశాలు ఉంటాయి.

ఎలా అప్లై చేసుకోవాలి?

1.CSIR CCMB Recruitment 2026 కు ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేయాలి.

2.అప్లై చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.

3. ఆన్‌లైన్ ఫారమ్‌లో

4. వ్యక్తిగత వివరాలు

5. విద్యార్హతలు

6.సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి.

7. అప్లికేషన్ ఫీజు ఉంటే, ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 23 ఫిబ్రవరి 2026.

Notification pdf : Click Here

Official Website : Click Here

Apply Link : Click Here

Leave a Comment