సచివాలయం లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… | CSIR CLRI Recruitment 2026 Apply Now :
CSIR CLRI Recruitment 2026 Apply Now :
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CLRI) నుండి సచివాలయం విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి CSIR CLRI Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయం పనితీరును నిర్వహించేందుకు అవసరమైన అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా డిగ్రీ అర్హత ఉన్న యువతకు ఇది మంచి అవకాశం.
ఈ ఉద్యోగాలకి 10th , ఇంటర్ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ సంస్థ భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో పరిధి లో ఉన్నాయి. ఇందులో జూనియర్ స్టెనోగ్రాఫేర్,జూనియర్ సచివాలయం అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 13 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వారు 2 మార్చ్ 2026 లోపు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
CSIR CLRI Recruitment 2026 – ముఖ్య సమాచారం:
CSIR CLRI అనేది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధీనంలో పనిచేసే ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ. ఈ సంస్థలో ఉద్యోగం పొందడం ద్వారా స్థిరమైన జీతభత్యాలు, భద్రతతో కూడిన భవిష్యత్ లభిస్తుంది. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్ (సచివాలయం) పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంస్థ పేరు: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CLRI) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. జూనియర్ స్టెనోగ్రాఫేర్,
2. జూనియర్ సచివాలయం అసిస్టెంట్
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 13
విద్య అర్హతలు:
A ) జూనియర్ స్టెనోగ్రాఫర్ :
1. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. స్టెనోగ్రఫీ పరిజ్ఞానం తప్పనిసరి.
3. ఇంగ్లీష్ లేదా హిందీ షార్ట్ హ్యాండ్‌లో నైపుణ్యం ఉండాలి.
4. కంప్యూటర్ ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
B ) జూనియర్ సచివాలయం అసిస్టెంట్ :
1. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. కంప్యూటర్ అప్లికేషన్స్ పై ప్రాథమిక అవగాహన ఉండాలి.
3. ఇంగ్లీష్ టైపింగ్ పరిజ్ఞానం తప్పనిసరి.
4. కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం అర్హతలు వర్తిస్తాయి.
C ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS):
1. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.
2. ప్రాథమిక చదవడం, వ్రాయడం తెలిసి ఉండాలి.
3. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయోపరిమితి :
1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC / ST అభ్యర్థులు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 ఇయర్స్, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
CSIR CLRI Recruitment 2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు క్రింది విధంగా ఫీజు చెల్లించాలి.
1. సాధారణ (UR) / OBC / EWS అభ్యర్థులు: ₹500/- ఫీజు చెల్లించాలి.
2. SC / ST / మహిళా అభ్యర్థులు / PwBD అభ్యర్థులు: ఫీజు లేదు (మినహాయింపు)
3. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి.
శాలరీ వివరాలు:
1. జూనియర్ స్టెనోగ్రాఫేర్ : నెలకి రూ 53,628/- జీతం ఇస్తారు.
2. జూనియర్ సచివాలయం అసిస్టెంట్ : నెలకి రూ 39,545 /- జీతం ఇస్తారు.
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి నెలకి రూ 35,973/- రూపాయలు జీతం ఇస్తారు.
4. అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం :
CSIR CLRI Recruitment 2026 లో అభ్యర్థుల ఎంపిక కింది విధంగా జరుగుతుంది:
1. రాత పరీక్ష (Written Examination)
2. టైపింగ్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులనే తుది ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి.
2. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్ చదవాలి.
3. అవసరమైన వివరాలతో అప్లికేషన్ ఫారం పూరించాలి.
4. సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
5. చివరగా ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 23 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 02 మార్చ్ 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here