Bank Jobs

Bank Jobs : గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్ విడుదల…తెలుగు భాష వస్తే చాలు…|Latest Federal Bank Recruitment 2026 Full Details :

calendar_month February 24, 2026 person chitra

Bank Jobs : గ్రామీణ బ్యాంకులో బంపర్ నోటిఫికేషన్ విడుదల…తెలుగు భాష వస్తే చాలు…|Latest Federal Bank Recruitment 2026 Full Details :

Federal Bank Associate Officer Posts 2026:

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన Federal Bank తాజాగా Associate Officer (Sales) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న యువతకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోని Careers సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 20 ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభమై 04 మార్చి 2026 వరకు కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న వారు చివరి తేదీకి ముందే అప్లై చేయడం మంచిది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Federal Bank లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు: Associate Officer (Sales) పోస్టులు ఉన్నాయి.

రిక్రూట్‌మెంట్ విధానం: కాంట్రాక్ట్ ఆధారంగా

విద్య అర్హతలు:

1. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

2. 10వ తరగతి, 12వ తరగతి/డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ మొత్తం విద్యలో కనీసం 50% మార్కులు ఉండాలి.

3. UGC చట్టం, 1956 ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా AICTE ఆమోదించిన విద్యాసంస్థ నుండి అర్హత పొందాలి.

వయోపరిమితి (01.02.2026 నాటికి):

1. జనరల్ అభ్యర్థులు: గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు

2. SC/ST అభ్యర్థులు: గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / ఇతరులు: ₹500/- రూపాయలు

2. SC/ST అభ్యర్థులు: ₹125/-

3. అదనంగా 18% GST మరియు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వర్తించవచ్చు.

జీతం వివరాలు:

1. సంవత్సరానికి కనీసం ₹4.64 లక్షలు నుండి గరిష్టంగా ₹6.70 లక్షలు వరకు ప్యాకేజ్.

2. ఎంపికైన అభ్యర్థులు NPS (National Pension Scheme) కింద కవర్ అవుతారు.

3. గ్రాట్యుటీ, తక్కువ వడ్డీ రేటుతో రుణ సౌకర్యం.

4. ఉద్యోగి మరియు ఆధారితులకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

1. గ్రూప్ డిస్కషన్ (Microsoft Teams ద్వారా వర్చువల్)

2. ఆప్టిట్యూడ్ టెస్ట్

3. పర్సనల్ ఇంటర్వ్యూ

4. బ్యాంక్ అవసరాన్ని బట్టి ఎంపిక విధానంలో మార్పులు ఉండవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ https://www.federalbank.co.in కు వెళ్లాలి.

2. Careers సెక్షన్‌లో Associate Officer (Sales) నోటిఫికేషన్‌ను ఎంపిక చేయాలి.

3. సూచనలను జాగ్రత్తగా చదివి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.

5. అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 ఫిబ్రవరి 2026

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 04 మార్చ్ 2026

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్

అధికారిక వెబ్‌సైట్: https://www.federalbank.co.in

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *