IHE Notification 2026 : 12వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగావకాశం | రూ.45,500 వరకు జీతం… వెంటనే అప్లై చేసుకోండి?
IHE Notification 2026 : 12వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగావకాశం | రూ.45,500 వరకు జీతం… వెంటనే అప్లై చేసుకోండి?
IHE Notification 2026:
Institute of Home Economics (IHE) నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన గవర్నమెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ వంటి బోధనేతర (Non-Teaching) పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://dunt.uod.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ 06 మార్చి 2026. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: Institute of Home Economics (IHE) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ – 05 పోస్టులు
2. ల్యాబొరేటరీ అసిస్టెంట్ – 02 పోస్టులు
3. ల్యాబొరేటరీ అటెండెంట్ – 14 పోస్టులు
మొత్తం పోస్టులు : 21
విద్య అర్హతలు:
జూనియర్ అసిస్టెంట్ :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ.
2. ఇంగ్లీష్ టైపింగ్ @ 35 wpm లేదా హిందీ టైపింగ్ @ 30 wpm.
3. కంప్యూటర్ ఆపరేషన్లలో ప్రావీణ్యం తప్పనిసరి.
ల్యాబొరేటరీ అసిస్టెంట్ / ల్యాబొరేటరీ అటెండెంట్ :
1. గుర్తింపు పొందిన కేంద్ర/రాష్ట్ర బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 10+2 ఉత్తీర్ణత లేదా
2. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ల్యాబొరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI అర్హత ఉండాలి.
వయోపరిమితి:
1. గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / అన్‌రిజర్వ్డ్ – రూ.1,000/- ఉంటుంది.
2. OBC (NCL), EWS, మహిళలు – రూ.800/- ఉంటుంది.
3. SC, ST, PWBD – రూ.600/- ఉంటుంది.
4. అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
జీతం వివరాలు:
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.45,500 వరకు జీతం చెల్లించబడుతుంది.
2. అదనంగా ఇతర ప్రభుత్వ భత్యాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. తుది ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
1. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయి.
2. అధికారిక వెబ్‌సైట్: https://dunt.uod.ac.in
3. నోటిఫికేషన్ చదివి అర్హతలను పరిశీలించిన తరువాత మాత్రమే అప్లై చేయాలి.
4. అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 14 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ చివరి తేదీ: 06 మార్చి 2026
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now