పదవ తరగతి అర్హతతో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

పదవ తరగతి అర్హతతో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

Indian Coast Guard Group C Civilian Recruitment 2025 :

హాయ్ ఫ్రెండ్స్…. నిరుద్యోగులకు శుభవార్త … కేంద్ర ప్రభుత్వ పెర్మనెంట్ గ్రూప్ సి jobs కలవు. 2025 సంవత్సరానికి సంబంధించి కోస్ట్ గార్డ్ విడుదల చేసిన Group C Civilian Recruitment లో భాగంగా MTS (Multi Tasking Staff) వంటి పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ముఖ్యంగా పదవ తరగతి (10th Class) అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో MTS (Peon / Mali / Sweeper / Daftary / Chowkidar మొదలైనవి),Lascar, Engine Driver ,Fireman ,Store Keeper Grade-II మొదలైనవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎలాంటి అనుభవం అవసరం లేదు. 10th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

సంస్థ పేరు:  ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: Indian Coast Guard Group C కింద పలు సివిలియన్ పోస్టులు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం

1. MTS (Peon / Mali / Sweeper / Daftary / Chowkidar మొదలైనవి)

2. Lascar

3. Engine Driver

4. Fireman

5. Store Keeper Grade-II మొదలైనవి ఉన్నాయి.

కానీ పదవ తరగతి అర్హతతో ఎక్కువగా MTS పోస్టులకే దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా పెర్మనెంట్ నేచర్‌లో ఉండి, కేంద్ర ప్రభుత్వ వేతన నియమావళి (7th CPC Pay Matrix) ప్రకారం జీతం లభిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 03

కావాల్సిన విద్యార్హత:

1. కనీసం 10th Class ఉత్తీర్ణత.

2. కొన్నిపోస్టులకు ITI సర్టిఫికేట్ ఉండవచ్చు, అయితే MTS పోస్టులకు సాధారణంగా 10th చాలు.

వయస్సు పరిమితి:

1. సాధారణంగా 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

2. SC/STలకు, OBCలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో రాయితీలు వర్తిస్తాయి.

అనుభవం:

MTS పోస్టులకు ఏ విధమైన పని అనుభవం అవసరం లేదు.

జీతం వాటి వివరాలు:

MTS పోస్టులకు సాధారణంగా Pay Level-1 (₹18,000 – ₹56,900) వరకు శాలరీ ఉంటుంది. అదనంగా:

1. Dearness Allowance

2. House Rent Allowance

3. Transport Allowance

4. Medical Benefits

5. Pension (NPS)

మొత్తంగా ఇది స్థిరమైన, లాభదాయకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.

ఎంపిక విధానం:

ఎంపిక పద్ధతి సాధారణంగా ఈ విధంగా ఉంటుంది

1. Written Test – బేసిక్ మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ ప్రశ్నలు.

2. Skill/Physical Test – పోస్టు మీద ఆధార పడి చిన్న స్థాయి పరీక్ష.

3. Document Verification.

పరీక్షలు చాలా సులభంగా ఉంటాయి కాబట్టి పదవ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం :

1. అభ్యర్థులు అధికారిక కోస్ట్ గార్డ్ వెబ్‌సైట్‌లో Offline/Online Application Form నింపాలి.

2. అవసరమైన పత్రాల కాపీలు జత చేయాలి.

3. నోటిఫికేషన్‌లో పేర్కొన్న చివరి తేదీకి ముందుగా అప్లై చేయాలి.

4. ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండకపోవచ్చు (పోస్టు ఆధారంగా మారవచ్చు)

అప్లికేషన్ మోడ్:ఆఫ్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: 06 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 20 జనవరి 2026.

వెబ్సైటు: https://indiancoastguard.gov.in/

Notification pdf : Click Here

Official website : Click Here

Leave a Comment