పరీక్ష , ఫీజు లేకుండా ISRO లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల … ఇలా అప్లై చేసుకోండి. | ISRO IPRC Notification 2025 :
ISRO IPRC Recruitment 2025:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కి చెందిన ISRO Propulsion Complex (IPRC) నుంచి 2025 సంవత్సరానికి గాను పరీక్ష లేకుండా, దరఖాస్తు ఫీజు లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాకుండా ఇంజనీరింగ్ , డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ISRO IPRC Notification 2025 ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులకు మంచి వేతనం, శాశ్వత ఉద్యోగ భద్రత, కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు లభిస్తాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని ISRO సూచిస్తోంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ISRO IPRC నోటిఫికేషన్ 2025 ముఖ్య వివరాలు:
సంస్థ పేరు: Indian Space Research Organisation (ISRO) – IPRC లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. టెక్నికల్ అప్రెంటిస్
2. ట్రేడ్ అప్రెంటిస్
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (కొన్ని విభాగాల్లో)
మొత్తం పోస్టులు :100
విద్య అర్హతలు:
పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి:
1. ITI (సంబంధిత ట్రేడ్‌లో),
2. డిప్లొమా (ఇంజినీరింగ్ విభాగాల్లో),
3. B.E / B.Tech (గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం) లో 60% మార్కులు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి:
1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC / ST / OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ISRO అప్రెంటిస్ పోస్టులకు మంచి స్టైపెండ్ ఇస్తుంది:
1. ట్రేడ్ అప్రెంటిస్ – ₹8,000 / నెల (సుమారు)
2. డిప్లొమా అప్రెంటిస్ – ₹9,000 / నెల
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – ₹10,000 / నెలకి శాలరీ ఇస్తారు. ఇది పోస్టును బట్టి మారవచ్చు.
దరఖాస్తు ఫీజు:
1. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
2. జనరల్ / OBC / SC / ST / మహిళా అభ్యర్థులు – ₹0
3. ISRO ఈ నోటిఫికేషన్‌ను పూర్తిగా ఉచితంగా అప్లై చేసే అవకాశం కల్పించింది.
ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా:
1. మెరిట్ లిస్ట్ ఆధారంగా
2. విద్యార్హతలో వచ్చిన మార్కుల ప్రకారం
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
ISRO IPRC ఉద్యోగాలకు అప్లై ఈ క్రింది విధం గా చేయండి.
1. ISRO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. ISRO IPRC Notification 2025 లింక్ ఓపెన్ చేయండి.
3. అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపండి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
5. సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ఇంటర్వ్యూ డేట్స్ :
టెక్నీషియన్ అప్రెంటిస్ : ( డిప్లొమా ): 10th జనవరి 2026
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : ( ఇంజనీరింగ్ ) : 10th జనవరి 2026
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 🙁 నాన్ ఇంజనీరింగ్) :11th జనవరి 2026
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకొనే అభ్యర్థులు ఇంటర్వ్యూ కి సర్టిఫికెట్స్ తో అటెండ్ అవాల్సిఉంటుంది. ఇంటర్వ్యూ లను జనవరి 10, 11 తేదీలలో నిర్వహిస్తారు.
Notification pdf : Click Here
Official Website : Click Here