విద్యా శాఖ లో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల … ఇలా అప్లై చేయండి. | NITRKL Non Teaching Notification 2026:
NITRKL Non Teaching Recruitment 2026:
విద్యా రంగంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలో ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – రౌర్కెలా (NIT Rourkela) నుండి Non Teaching Notification 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యంగా లైబ్రరీ అసిస్టెంట్ తదితర నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. NIT రౌర్కెలా లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో లైబ్రరీ విభాగానికి సంబంధించిన పోస్టులు ఉండటం వల్ల లైబ్రరీ సైన్స్ చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
ఇందులో లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్,సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ , అసిస్టెంట్ లైబ్రేరియన్, సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా విద్య అర్హత డిగ్రీ, B.E / B.Tech/ M.sc కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కావున ఆసక్తి గల అభ్యర్థులు https://www.nitrki.ac.in/Career/Non Teaching లింక్ ను సందర్శించి ఆన్లైన్ లో అప్లై చేసుకోగలరు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి 19 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
సంస్థ పేరు: నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్,సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ , అసిస్టెంట్ లైబ్రేరియన్, సైంటిఫిక్ ఆఫీసర్ అండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 10
పోస్టింగ్ విధానం: పెర్మనెంట్
వయో పరిమితి:
1. సాధారణంగా అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
2. గరిష్టంగా 56 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా) మించకూడదు.
3. SC / ST / OBC / PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
విద్య అర్హతలు:
లైబ్రేరియన్ :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ (MA / MSc / MCom లేదా సమానమైనది).
2. లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ (MLIS / MLIB).
3. NET / SET అర్హత ఉండాలి (కొన్ని సంస్థల్లో Ph.D ఉంటే మినహాయింపు ఉంటుంది)
4. అకడమిక్ లైబ్రరీలో పని చేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం.
డిప్యూటీ లైబ్రేరియన్ :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ.
2. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ (MLIS)
3. లైబ్రరీ విభాగంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం
4. కంప్యూటరైజ్డ్ / డిజిటల్ లైబ్రరీ సిస్టమ్స్ పై అవగాహన ఉండాలి
అసిస్టెంట్ లైబ్రేరియన్ :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Any Degree)
2. లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ లేదా మాస్టర్స్ (BLIS / MLIS)
3. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
4. డిజిటల్ లైబ్రరీ లేదా ఈ-రిసోర్సెస్ పై అవగాహన ఉంటే అదనపు ప్రయోజనం
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ :
1. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ / టెక్నాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ (B.E / B.Tech) లేదా సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ (MSc)
2. సంబంధిత రంగంలో కనీసం 6 – 8 సంవత్సరాల అనుభవం
3. రీసెర్చ్, ల్యాబ్ మేనేజ్‌మెంట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
సైంటిఫిక్ ఆఫీసర్ :
1. సంబంధిత విభాగంలో B.E / B.Tech లేదా MSc (Physics / Chemistry / Biology / Computer Science మొదలైనవి)
2. ప్రాథమిక రీసెర్చ్ లేదా టెక్నికల్ వర్క్ అనుభవం ఉండాలి
3. ఫ్రెషర్స్ కూడా కొన్ని పోస్టులకు అర్హులే
అసిస్టెంట్ రిజిస్ట్రార్ :
1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ (Any Discipline)
2. యూనివర్సిటీ / విద్యా సంస్థలలో అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంటే ప్రాధాన్యం
3. కంప్యూటర్ అప్లికేషన్స్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ పై అవగాహన ఉండాలి
మెడికల్ ఆఫీసర్ :
1. గుర్తింపు పొందిన మెడికల్ కాలేజ్ నుండి MBBS డిగ్రీ
2. సంబంధిత రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
3. ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రంలో పని చేసిన అనుభవం ఉంటే ప్రాధాన్యం
4. ప్రభుత్వ వైద్య నియమాలకు అనుగుణంగా అర్హతలు ఉండాలి
జీతం వివరాలు:
1. లైబ్రేరియన్ కి నెలకి ₹ 1,44,200/- నుంచి ₹ 2,18,200/- వరకు జీతం ఇస్తారు.
2. డిప్యూటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, సైంటిఫిక్ ఆఫీసర్ & మెడికల్ ఆఫీసర్ కి నెలకి ₹ 56,100/- నుంచి ₹1,77,500/- జీతం ఇస్తారు.
3. డిప్యూటీ లైబ్రేరియన్,అండ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కి నెలకి ₹ 78,800/- నుంచి ₹2,09,200/- జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC అభ్యర్థులకు ₹1000 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
2. EWS అభ్యర్థులకు ₹ 500 చెల్లించాలి.
3. PWD మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
ఎంపిక విధానం:
NITRKL Non Teaching Notification 2026 లో ఎంపిక సాధారణంగా ఈ విధంగా ఉంటుంది.
1. రాత పరీక్ష (Written Test)
2. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ (అవసరమైతే)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉండవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి.
2. NIT రౌర్కెలా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
3. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
4. దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా ఫిల్ అప్ చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
6. దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
7. ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 14 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2026.
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Link : Click Here