10th అర్హతతో పోస్ట్ ఆఫీస్ లో 40,000+ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | Post Office Recruitment 2025 Apply Now
Post Office Recruitment 2025:
హాయ్ ఫ్రెండ్స్… నిరుద్యోగులకు మంచి శుభవార్త… భారత ప్రభుత్వానికి చెందిన ఇండియా పోస్ట్ (India Post) శాఖ నుంచి 2025 సంవత్సరానికి గాను భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 40,000కు పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా పదవ తరగతి (10th) అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. రాత పరీక్ష లేకుండానే, మెరిట్ ఆధారంగా ఎంపిక జరగనుండటం వల్ల నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి వార్త… అంతేకాకుండా ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. అలాగే వయస్సు కూడా 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులు కావాలనుకునే అభ్యర్థులు 15 జనవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Post Office Recruitment 2025- ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: భారత ప్రభుత్వానికి చెందిన ఇండియా పోస్ట్ (India Post) శాఖ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో ప్రధానంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కింది పోస్టులు ఉంటాయి:
1. బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM)
3. డాక్ సేవక్
ఈ పోస్టులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పోస్టాఫీసుల్లో భర్తీ చేయబడతాయి.
మొత్తం పోస్టులు : 40,000+ పోస్టులు
విద్య అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి (10th class) పూర్తి చేసి ఉండాలి.
1. 10వ తరగతిలో గణితం, స్థానిక భాష సబ్జెక్ట్ ఉండాలి
2. కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఉండటం అవసరం.
ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అవసరం లేకపోవడం వల్ల చాలా మందికి ఇది సులభంగా అప్లై చేసే అవకాశం.
వయస్సు:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు రిలాక్సేషన్ :
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు
OBC అభ్యర్థులు: గరిష్ట వయస్సులో 3 సంవత్సరాల సడలింపు
PwD (వికలాంగ) అభ్యర్థులు: 10 సంవత్సరాల సడలింపు
PwD + OBC: 13 సంవత్సరాల సడలింపు
PwD + SC / ST: 15 సంవత్సరాల సడలింపు
ఎంపిక విధానం
1. ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు.
2. 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు
3. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలెక్షన్
5. అందువల్ల, తక్కువ పోటీతో మంచి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్ట్‌ను బట్టి జీతం మారుతుంది:
BPM: సుమారు ₹18,500/-
ABPM / GDS: సుమారు ₹14,500/-
ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC / EWS: ₹100 రూపాయలు
2. SC / ST / PWD / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. “Post Office Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
3. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
4. దరఖాస్తు ఫారం వివరాలు నింపాలి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
6. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
7. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: 15 జనవరి 2026
Apply Link :Click Here
Official Website : Click Here