RRB New Exam Dates 2026 | రైల్వే శాఖ రాత పరీక్షల తేదీల్లో మార్పులు – కొత్త షెడ్యూల్ విడుదల:
నిరుద్యోగులకు ముఖ్య సమాచారం… RRB New Exam Dates 2026 | రైల్వే శాఖ రాత పరీక్షల తేదీల్లో మార్పులు – కొత్త షెడ్యూల్ విడుదల:
భారత రైల్వేలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. Railway Recruitment Board (RRB) తాజాగా పారామెడికల్ మరియు ఇతర పోస్టుల రాత పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికార ప్రకటనలో వెల్లడించింది.
RRB Paramedical Exam Schedule 2026 – మారిన తేదీలు:
రైల్వే శాఖలో పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10, 11, 12 తేదీల్లో ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
అయితే తాజా మార్పుల ప్రకారం ఇప్పుడు పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు RRB స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ మార్పులను గమనించి తమ ప్రిపరేషన్‌ను కొత్త తేదీలకు అనుగుణంగా కొనసాగించాలని సూచించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
పరీక్షల ఎంపిక విధానం:
పారామెడికల్ పోస్టుల ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
1. ఆన్లైన్ రాత పరీక్ష
2. మెడికల్ పరీక్ష
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. సిటీ ఇంటిమేషన్ & అడ్మిట్ కార్డ్ వివరాలు
5. పరీక్షలకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేస్తారు.
6. పరీక్షలకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంచుతారు.
7. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
టెక్నీషియన్ పోస్టుల పరీక్ష తేదీల్లో కూడా మార్పులు:
పారామెడికల్ పోస్టులతో పాటు RRB టెక్నీషియన్ గ్రేడ్–1 (సిగ్నల్) మరియు టెక్నీషియన్ గ్రేడ్–3 పోస్టుల పరీక్ష తేదీల్లో కూడా మార్పులు చేసినట్లు వెల్లడించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా:
మార్చి 6
మార్చి 9
మార్చి 10
మార్చి 13 తేదీల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించబడతాయి.
ముందుగా జనవరిలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పుడు తేదీల్లో మార్పులు చేయబడినట్లు స్పష్టం చేసింది.
అభ్యర్థులు మారిన తేదీలను తప్పనిసరిగా గమనించి, పూర్తి వివరాల కోసం Indian Railways అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని RRB విజ్ఞప్తి చేసింది.
పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now