RRB NTPC Station Master Jobs 2026 : విద్యార్థులకు అలర్ట్.. రైల్వే CBT-1 పరీక్ష సిటీ ఇంటిమేషన్ విడుదల:
RRB NTPC Station Master Jobs 2026 : విద్యార్థులకు అలర్ట్.. రైల్వే CBT-1 పరీక్ష సిటీ ఇంటిమేషన్ విడుదల:
RRB NTPC Station Master Jobs 2026 :
దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) RRB NTPC గ్రాడ్యుయేషన్ లెవెల్ CBT-1 పరీక్షకు సంబంధించిన Exam City Intimation Slip ను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ Registration Number మరియు Date of Birth నమోదు చేసి పరీక్షా నగరం, పరీక్ష తేదీ మరియు సమయం వంటి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
రైల్వే శాఖ విడుదల చేసిన తాజా నోటీసు ప్రకారం, RRB NTPC Graduate Level CBT-1 Exam దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలు మార్చి 16 నుంచి మార్చి 27 వరకు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5810 పోస్టులు భర్తీ చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
భర్తీ చేయనున్న ఉద్యోగాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
1. Chief Commercial cum Ticket Supervisor
2. Station Master
3. Goods Train Manager
4. Junior Accounts Assistant cum Typist
5. Senior Clerk cum Typist
6. Traffic Assistant
ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాలలో రోజుకు మూడు షిఫ్టులలో నిర్వహించబడతాయి.
పరీక్ష షిఫ్ట్ టైమింగ్స్ :
RRB NTPC CBT-1 పరీక్ష మూడు షిఫ్టులలో జరుగుతుంది.
మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 గంటలకు
రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 12:45 గంటలకు
మూడో షిఫ్ట్: సాయంత్రం 4:30 గంటలకు
అభ్యర్థులు తమకు ఇచ్చిన షిఫ్ట్ సమయానికి కనీసం ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
పరీక్షకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్:
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
1. Admit Card / Hall Ticket
2. Aadhaar Card
3. Voter ID
4. PAN Card
5. ఇతర ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడీ
6. బయోమెట్రిక్ వెరిఫికేషన్
7. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అభ్యర్థుల Aadhaar linked biometric verification నిర్వహించబడుతుంది.
8. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా Original Aadhaar Card లేదా e-Verified Aadhaar Print తీసుకురావాలి.
ఇంకా ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయని అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ముందుగానే వెరిఫికేషన్ పూర్తి చేయడం మంచిది, తద్వారా పరీక్షా కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటుంది.
ఎంపిక విధానం:
1. RRB NTPC పోస్టుల ఎంపిక పూర్తిగా Computer Based Test (CBT) ఆధారంగా జరుగుతుంది.
2. అభ్యర్థుల ప్రతిభ మరియు మెరిట్ ఆధారంగా మాత్రమే నియామకాలు చేపడతారు.
RRB NTPC పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ Exam City Intimation Slip డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష తేదీ మరియు కేంద్ర వివరాలు ముందుగానే తెలుసుకోవాలి.
RRB NTPC Graduate Level City Intimation : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now