Central Govt Jobs

Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | Sainik School Imphal Notification 2026 Full Details :

calendar_month March 10, 2026 person chitra

Govt Jobs : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | Sainik School Imphal Notification 2026 Full Details :

Sainik School Imphal Recruitment 2026:

భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న సైనిక్ స్కూల్ ఇంఫాల్ (మణిపూర్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Counsellor, Ward Boy, PEM/PTI-Cum-Matron & Nursing Sister పోస్టులను భర్తీ చేయనున్నారు.

10వ తరగతి, 12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు 29 మార్చి 2026 లోపు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .

పోస్టుల వివరాలు – ముఖ్యమైన వివరాలు :

సంస్థ: సైనిక్ స్కూల్స్ సొసైటీ లో ఉద్యోగాలు

పని చేసే సంస్థ: సైనిక్ స్కూల్ ఇంఫాల్ (మణిపూర్)

పోస్టుల వివరాలు :

1. Counsellor,

2. Ward Boy,

3. PEM/PTI-Cum-Matron,

4. Nursing Sister పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 07

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

విద్య అర్హతలు:

Counsellor:

1. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా

2. కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సెలింగ్‌లో డిప్లొమాతో గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి.

3. సంబంధిత రంగంలో అనుభవం ఉంటే ప్రాధాన్యం.

Ward Boy:

1. గుర్తింపు పొందిన సంస్థ నుండి 10వ తరగతి (Matriculation)

2. బి.ఏ / బి.ఎస్.సి / బి.కామ్ డిగ్రీ ఉంటే ప్రాధాన్యం

3. క్రీడలలో డిగ్రీ లేదా డిప్లొమా

4. ఇంగ్లీషులో మాట్లాడగలగాలి.

PEM/PTI-Cum-Matron:

1. గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్

2. బి.ఏ / బి.ఎస్.సి / బి.కామ్

3. క్రీడలలో డిగ్రీ / డిప్లొమా

4. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలగాలి.

Nursing Sister:

1. నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ

2. కనీసం 5 సంవత్సరాల అనుభవం

3. ఇంగ్లీషులో మాట్లాడగలగాలి.

వయస్సు పరిమితి:

01 మార్చి 2026 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. అప్లికేషన్ ఫీజు: ₹500

2. బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా “Principal, Sainik School Imphal” పేరిట చెల్లించాలి.

లేదా

Bank of India – Sainik School Branch

IFSC Code: BKID0005064

Account Number: 506420110000001

3. ఆన్‌లైన్ చెల్లింపు చేసిన రసీదును దరఖాస్తుతో జత చేయాలి.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹25,000 నుండి ₹30,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

1. రాత పరీక్ష

2. నైపుణ్య పరీక్ష (అవసరమైతే)

3. ఇంటర్వ్యూ

4. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.

5. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssimphal.nic.in నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో నింపాలి.

2. అప్లికేషన్‌తో పాటు క్రింది పత్రాలను జత చేయాలి:

విద్యార్హత సర్టిఫికెట్లు

అనుభవ సర్టిఫికెట్లు

పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

బయో-డేటా

మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి

₹60 స్టాంప్‌తో స్వీయ చిరునామా కవర్

అప్లికేషన్ పంపవలసిన చిరునామా:

Principal
Sainik School Imphal
P.O. Pangei Yangdong
Imphal East – 795114
Manipur.

3. గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు లేదా పూర్తి వివరాలు లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ: 29 మార్చి 2026

Notification & Application pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *