Sainik School Jobs 2026: కోరుకొండ సైనిక్ స్కూల్ లో PTI Cum Matron Recruitment 2026 …. ఆఫ్ లైన్ విధానం లో ఇలా దరఖాస్తు చేసుకోండి!
Korukonda Sainik School PTI Cum Matron Jobs 2026:
దేశవ్యాప్తంగా పేరొందిన సైనిక్ స్కూల్స్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా కోరుకొండలో ఉన్న సైనిక్ స్కూల్ నుండి PTI Cum Matron పోస్టుకు సంబంధించి Sainik School Jobs 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా ఆఫ్‌లైన్ విధానం ద్వారా జరగనున్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సైనిక్ స్కూల్ కోరుకొండ ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా PTI కమ్ మెట్రాన్ ( మహిళలకి) పోస్టు కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల వారు 13 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ వివరాలు- ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: సైనిక్ స్కూల్ కోరుకొండ లో జాబ్
పోస్ట్ పేరు: PTI Cum Matron
ఉద్యోగ స్థాయి: స్కూల్ నాన్-టీచింగ్ స్టాఫ్
మొత్తం పోస్టులు : 01
విద్య అర్థతలు:
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ / 12వ తరగతి / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. Physical Training (PT) లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉండటం అవసరం.
3. విద్యార్థులతో పని చేసిన అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయో పరిమితి:
1. కనిష్ట వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాల కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ 500/- ఫీజు చెల్లించాలి. అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.
శాలరీ డీటెయిల్స్ :
1. ఈ ఉద్యోగానికి ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి రూ 34,164/- జీతం ఇస్తారు.
2. Rent ఫ్రీ accomodation , ఫుడ్ కూడా provide చేస్తారు.
ఎంపిక విధానం:
ఈ నియామకాలు క్రింది దశల ద్వారా నిర్వహిస్తారు:
1. దరఖాస్తుల పరిశీలన
2. రాత పరీక్ష / ప్రాక్టికల్ టెస్ట్
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
దరఖాస్తు విధానం – ఆఫ్‌లైన్:
అభ్యర్థులు తప్పనిసరిగా ఆఫ్‌లైన్ విధానం లోనే దరఖాస్తు చేయాలి.
చిరునామా: ది ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కోరుకొండ, పోస్ట్ : సైనిక్ స్కూల్ కోరుకొండ
జిల్లా : విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ . PIN : 535214.
దరఖాస్తు ప్రక్రియ:
1. సైనిక్ స్కూల్ కోరుకొండ అధికారిక నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేయండి.
2. ఫారంలో అవసరమైన వివరాలను స్పష్టంగా పూరించండి.
3.విద్యా సర్టిఫికెట్లు, వయస్సు ధ్రువీకరణ, అనుభవ పత్రాలు జత చేయండి.
4. అవసరమైతే దరఖాస్తు ఫీజు DD రూపంలో చెల్లించండి.
5. పూర్తి చేసిన అప్లికేషన్‌ను నిర్ణీత చిరునామాకు పోస్టు ద్వారా పంపించండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 13 ఫిబ్రవరి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here