Central Govt Jobs

పదవ తరగతి అర్హతతో హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాల నోటిఫికేషన్… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | Latest Sainik School MTS & Ward Boys Job requirement 2026 :

calendar_month March 20, 2026 person chitra

పదవ తరగతి అర్హతతో హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాల నోటిఫికేషన్… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | Latest Sainik School MTS & Ward Boys Job requirement 2026 :

Sainik School MTS & Ward Boys Jobs 2026:

నిరుద్యోగులకు మంచి శుభవార్త. సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో MTS (Multi Tasking Staff) మరియు వార్డ్ బాయ్స్ / హాస్టల్ వార్డెన్స్ పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉచిత వసతి మరియు భోజనం వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ఈ నెల 31 మార్చి 2026 లోపు అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. MTS (General Employee),

2. Ward Boys ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 16

రిక్రూట్‌మెంట్ విధానం: రెగ్యులర్ & కాంట్రాక్ట్

విద్యా అర్హతలు :

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (Matriculation) లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

2. అదనపు అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.

వయో పరిమితి:

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనిష్టం: 21 సంవత్సరాలు, గరిష్టం: 50 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / OBC అభ్యర్థులకు : ₹500

2. SC / ST అభ్యర్థులకు : ₹200

3. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో Principal, Sainik School Amaravathinagar పేరుతో చెల్లించాలి.

జీతం వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹18,000 నుండి ₹56,900 వరకు జీతం చెల్లిస్తారు.

2. అదనంగా ఉచిత వసతి మరియు భోజనం సౌకర్యం ఉంటుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

1. షార్ట్‌లిస్టింగ్

2. రాత పరీక్ష

3. నైపుణ్య / ట్రేడ్ టెస్ట్

4. వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుతో పాటు క్రింది డాక్యుమెంట్లు జతచేయాలి:

1. తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

2. 10వ తరగతి మరియు ఇతర విద్యా సర్టిఫికేట్లు

3. అనుభవ సర్టిఫికేట్లు (ఉంటే)

4. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

5. డిమాండ్ డ్రాఫ్ట్

6. కవరుపై మీరు అప్లై చేస్తున్న పోస్టు పేరును తప్పనిసరిగా రాయాలి.

Address:

PRINCIPAL,
Sainik School, Amaravathinagar,
Udumalpet Taluk, Tiruppur District,
Tamil Nadu – 642102.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే కొనసాగుతోంది.

దరఖాస్తు చివరి తేదీ: 31 మార్చి 2026.

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *