SBI CBO Bank Jobs : గ్రామీణ బ్యాంకు లో SBI CBO నోటిఫికేషన్ విడుదల… తెలుగు భాష వస్తే చాలు… | Latest SBI CBO Notification 2026 Apply Now :
SBI CBO Bank Jobs : గ్రామీణ బ్యాంకు లో SBI CBO నోటిఫికేషన్ విడుదల… తెలుగు భాష వస్తే చాలు… | Latest SBI CBO Notification 2026 Apply Now :
Latest SBI CBO Notification 2026:
హలో ఫ్రెండ్స్ …ఈ రోజు మీ కోసం మరో సూపర్ జాబ్ అప్‌డేట్ తీసుకొచ్చాం. మీరు బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 2050 పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు భాషపై ప్రావీణ్యం ఉంటే చాలు, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు 29.01.2026 నుండి 18.02.2026 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. దరఖాస్తులు SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.bank.in/web/careers/current ద్వారా స్వీకరించబడతాయి.
Latest SBI Circle Based Officers Recruitment 2026 – పూర్తి వివరాలు:
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
పోస్ట్ పేరు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 2050
రిక్రూట్‌మెంట్ విధానం: రెగ్యులర్ ఉద్యోగాలు
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
వయోపరిమితి:
1. అభ్యర్థి వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు : 3 సంవత్సరాలు, దివ్యంగులకి 10 నుంచి 15 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత :
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
2. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) కలిగిన వారు, అలాగే మెడికల్, ఇంజనీరింగ్, CA, Cost Accountant వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు.
జీతం వివరాలు:
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకి జీతం ₹48,480/- , గరిష్ట జీతం ₹85,920/- వరకు ఉంటుంది.
2. అదనంగా DA, HRA/లీజ్ రెంట్, CCA, PF, NPS, LFC, మెడికల్ సౌకర్యాలు మరియు ఇతర అలవెన్సులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC / EWS : ₹750/- ఫీజు చెల్లించాలి.
2. SC / ST / PwBD : ఫీజు లేదు
3. చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు.
ఎంపిక విధానం:
SBI CBO నియామకం మొత్తం 4 దశల్లో జరుగుతుంది.
1. ఆన్‌లైన్ పరీక్ష
2. స్క్రీనింగ్
3. ఇంటర్వ్యూ
4. స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. క్రింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.
1. ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. https://sbi.bank.in/web/careers/current
2. హోమ్‌పేజీలో “Current Openings” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. అందులో “SBI Circle Based Officers (CBO) Recruitment 2026” నోటిఫికేషన్‌ను ఎంచుకోండి.
4. “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
5. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేయండి.
6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయి, వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయండి.
7. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
8. అప్లికేషన్ ఫీజు వర్తించే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా (డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్) చెల్లించాలి.
9. అన్ని వివరాలు మరోసారి చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
10. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత దాని ప్రింట్ అవుట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 18 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here