SSB Constable Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 827 పోస్టులు – వెంటనే అప్లై చేయండి…
SSB Constable Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 827 పోస్టులు – వెంటనే అప్లై చేయండి…
SSB Constable Recruitment 2026:
హాయ్ నిరుద్యోగుల యువత కి శుభవార్త…. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Sashastra Seema Bal (SSB) నుండి భారీ ఉద్యోగావకాశం విడుదలైంది. గ్రూప్-C నాన్-గెజిటెడ్ (కంబాటైజ్డ్) పోస్టుల కింద Constable Tradesman & Driver ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 827 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 19 ఏప్రిల్ 2026 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
SSB Constable Jobs 2026 – ముఖ్య సమాచారం:
సంస్థ పేరు: Sashastra Seema Bal లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: Constable (Tradesman & Driver) పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు :
1. Constable (Driver – Male Only): 533
2. Constable (Veterinary): 34
3. Constable (Gardener): 41
4. Constable (Water Carrier): 05
5. Constable (Cobbler): 25
6. Constable (Tailor): 41
7. Constable (Washerman): 74
8. Constable (Barber): 43
9. Constable (Waiter): 03
10.Constable (Carpenter): 07
11. Constable (Nursing Orderly): 01
మొత్తం పోస్టులు: 827
జాబ్ టైప్: పర్మనెంట్
విద్య అర్హతలు :
SSB Constable Driver Job:
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. చెల్లుబాటు అయ్యే Heavy Vehicle Driving License తప్పనిసరి.
SSB Veterinary Constable Jobs:
1. 10వ తరగతి (Science subject)
2. పశువైద్య ఆసుపత్రిలో 1 సంవత్సరం అనుభవం.
Tradesman పోస్టులు (Tailor, Barber, Washerman, etc.):
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. సంబంధిత ట్రేడ్‌లో అనుభవం లేదా ITI / డిప్లొమా
Carpenter:
1. 10వ తరగతి + ట్రేడ్ అనుభవం / ITI / డిప్లొమా
2. ట్రేడ్ టెస్ట్ అర్హత
Nursing Orderly:
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. First Aid Certificate (Red Cross / St. John Ambulance)
వయోపరిమితి:
1.కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 27 సంవత్సరాలు మధ్య ఉండాలి .
2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. UR / OBC / EWS: ₹100/-
2. SC / ST / మహిళలు / Ex-Servicemen: ఫీజు లేదు.
3. చెల్లింపు విధానం: Net Banking / Debit Card / Credit Card / UPI ద్వారా చెల్లించాలి.
జీతం వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ₹21,700 నుండి ₹69,100/- వరకు నెల జీతం (Pay Level-3) అందించబడుతుంది.
ఎంపిక విధానం :
1. PET / PST (Physical Test)
2. రాత పరీక్ష
3. ట్రేడ్ టెస్ట్
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. https://recruitment.ssb.gov.in
2. హోమ్‌పేజ్‌లో “Constable Tradesman & Driver Recruitment 2026” నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
3. పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
4. “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
5. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు సరిగా నమోదు చేయండి.
6. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
ఫోటో
సిగ్నేచర్
సర్టిఫికేట్స్
7. అప్లికేషన్ ఫీజు (అవసరమైతే) ఆన్లైన్‌లో చెల్లించండి.
8. చివరిగా అప్లికేషన్‌ను సమర్పించి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 21 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2026
Notification pdf : Click Heretelu
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now