సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా నుంచి క్లర్క్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల … వెంటనే అప్లై చేసుకోండి | Supreme Court Of India Law Clerk Notification 2026:

సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా నుంచి క్లర్క్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల … వెంటనే అప్లై చేసుకోండి | Supreme Court Of India Law Clerk Notification 2026:

Supreme Court Of India Law Clerk Notification 2026:

భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా నుంచి 2026 సంవత్సరానికి సంబంధించి లా క్లర్క్ (Law Clerk-cum-Research Associate) ఉద్యోగాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. న్యాయ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక అరుదైన మరియు విలువైన అవకాశం అని చెప్పవచ్చు.

సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా లా క్లర్క్స్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 90 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ లా అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు వయస్సు కూడా 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలు 2 స్టేజెస్ లో నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సుప్రీమ్ కోర్ట్ లా క్లర్క్ ఉద్యోగాల వివరాలు:

సంస్థ పేరు: Supreme Court of India లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : Law Clerk-cum-Research Associate పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 90

విద్య అర్హతలు:

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి LLB డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. తుది సంవత్సరం LLB చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

3.లీగల్ రీసెర్చ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు , OBC అభ్యర్థులకు 3సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1.ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 750/- రూపాయలు చెల్లించాలి.

2. దరఖాస్తులను ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

శాలరీ వివరాలు:

1. సుప్రీమ్ కోర్ట్ లా క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹90,000 వరకు గౌరవ వేతనం (Consolidated Remuneration) చెల్లించబడుతుంది.

2. అన్ని రకాల అలవెన్సుస్ ఉంటాయి.

ఎంపిక విధానం:

సుప్రీమ్ కోర్ట్ లా క్లర్క్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ కింది విధంగా ఉంటుంది:

1. రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కూడా 2 స్టేజెస్ లో నిర్వహిస్తారు.

2. ఇంటర్వ్యూ (Interview)

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. రాత పరీక్షలో అభ్యర్థుల న్యాయ పరిజ్ఞానం, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ రెండు దశల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు తుది ఎంపిక జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి.

2. సుప్రీమ్ కోర్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.

3.అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

4. దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలు జాగ్రత్తగా పరిశీలించాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 2026

Official Website: Click Here

Notification pdf : Click Here

Apply Online : Click Here

Leave a Comment