తెలంగాణ లో 858 పోస్టులతో జిల్లా కోర్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల | Telangana District Court Jobs Notification 2026 Apply Now :

తెలంగాణ లో 858 పోస్టులతో జిల్లా కోర్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల | Telangana District Court Jobs Notification 2026 Apply Now :

Telangana District Court Jobs Recruitment 2026:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లా కోర్టులలో భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 858 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాలు కోర్ట్ విభాగంలో స్థిరమైన భవిష్యత్తు, మంచి జీతభత్యాలు, గౌరవప్రదమైన ఉద్యోగ హోదా కలిగి ఉంటాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.

ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, ఎక్సమినర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫేర్, టైపిస్ట్, కాపిస్ట్ , ప్రాసెస్ సర్వర్, ఉద్యోగాలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఉద్యోగాలకి 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు కూడా 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫ్ లైన్ విధానం లో పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ జిల్లా కోర్ట్ ఉద్యోగాల వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పలు విభాగాల పోస్టులు ఉన్నాయి. పోస్టుల సంఖ్య జిల్లాల వారీగా మారవచ్చు.

సంస్థ పేరు: తెలంగాణ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డు అసిస్టెంట్, ఎక్సమినర్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫేర్, టైపిస్ట్, కాపిస్ట్ , ప్రాసెస్ సర్వర్, ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 858

విద్య అర్హతలు:

1. పోస్టును బట్టి విద్యార్హతలు భిన్నంగా ఉంటాయి.

2. కనీస అర్హత: ఇంటర్మీడియట్ / డిగ్రీ

3. కొన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ స్కిల్స్ అవసరం ఉంటుంది.

4. స్టెనోగ్రాఫర్ పోస్టులకు షార్ట్ హ్యాండ్ అర్హత తప్పనిసరి.

వయోపరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 46 సంవత్సరాల మధ్య ఉండాలి.(పోస్టును బట్టి మారవచ్చు)

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS, Ex-Servicemen అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

తెలంగాణ జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతం చెల్లించబడుతుంది.

1. నెలసరి జీతం: సుమారు ₹35,000/- నుంచి ₹65,000 వరకు (పోస్టును బట్టి) జీతం ఇస్తారు.

2. అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది విధం గా ఫీజు చెల్లించాలి.

1. OC , BC అభ్యర్థులకు ₹ 600/- ఫీజు చెల్లించాలి.

2. SC ,ST అభ్యర్థులకు ₹ 400/- రూపాయలు ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం:

తెలంగాణ జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు ఎంపిక విధానం సాధారణంగా క్రింది విధంగా ఉంటుంది:

1. 80 మార్కులు OMR విధానం లో రాత పరీక్ష ఉంటుంది.

2. 20 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది.

3. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ (అవసరమైతే)

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

5. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి.

1. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

2. అవసరమైన డాక్యుమెంట్లు: విద్యార్హత సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, ఆధార్, ఫోటో, సంతకం మొదలైనవి .

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 24 జనవరి 2026

అప్లికేషన్ చివరి తేదీ: 13 ఫిబ్రవరి 2026.

Official Website : Click Here

Notification pdf : Click Here

Leave a Comment