Latest jobs

Court Jobs 2026 : 7వ, 10వ తరగతి అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు | Telangana High Court Recruitment 2026 – Apply Online:

calendar_month February 4, 2026 person chitra

Court Jobs 2026 : 7వ, 10వ తరగతి అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు | Telangana High Court Recruitment 2026 – Apply Online:

తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు 2026 పూర్తి వివరాలు:

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సర్వీసులోని ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో చేపడుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,000/- నుంచి రూ.58,850/- వరకు నెల జీతం అందించబడుతుంది. ముఖ్యంగా 7వ లేదా 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి సొంత జిల్లాలోనే ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది.ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ 07 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభమై 28 ఫిబ్రవరి 2026 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. దరఖాస్తులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ https://tshc.gov.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.

జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు – మొత్తం ఖాళీలు:

సంస్థ పేరు: తెలంగాణ హైకోర్టు సర్వీస్ లో ఉద్యోగాలు

పోస్టు పేరు: ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్

మొత్తం పోస్టులు : 34 పోస్టులు

రిక్రూట్‌మెంట్ విధానం: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

విద్యా అర్హతలు :

1. 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులే ఉండాలి.

2. 10వ తరగతి కి మించి ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థులను పరిగణించబడవు.

వయోపరిమితి:

1. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

2. SC / ST / BC / EWS – 5 సంవత్సరాలు, దివ్యాంగులు (PWD) – 10 సంవత్సరాలు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి రూ.19,000/- నుంచి రూ.58,850/- వరకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము:

1. OC / BC అభ్యర్థులు – రూ.600/-

2. SC / ST / EWS / PWD అభ్యర్థులు – రూ.400/- ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:

1. OMR ఆధారిత రాత పరీక్ష

2. ఇంటర్వ్యూ

3. రెండు దశల్లో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.

4. మార్కులు సమానంగా ఉంటే, వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

5. వయస్సు కూడా సమానంగా ఉంటే, విద్యా అర్హతలో అధిక మార్కులు పొందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. https://tshc.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

2. Telangana High Court Recruitment 2026 నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి

3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపండి.

4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

5. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

6. ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి

7. ఇతర ఏ విధమైన దరఖాస్తులు స్వీకరించబడవు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 07 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *