తెలంగాణ లో భారీగా outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | Telangana Outsourcing Jobs Notification 2026 Apply Now

తెలంగాణ లో భారీగా outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | Telangana Outsourcing Jobs Notification 2026 Apply Now:

Telangana Outsourcing Jobs Recruitment 2026 :

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మరో శుభవార్త. Telangana Outsourcing Jobs Notification 2026 ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అవకాశాన్ని ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష లేకుండా, కేవలం అర్హతల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉండటం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, ఐటీ విభాగాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు వంటి విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.

అంతేకాకుండా ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్,ఎలక్ట్రీషియన్, డ్రైవర్,అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, కిచెన్ బాయ్,కుక్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Telangana Outsourcing Jobs Notification – ముఖ్య సమాచారం:

సంస్థ పేరు: తెలంగాణ లోని నర్సింగ్ వైద్య కళాశాల లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్,ఎలక్ట్రీషియన్, డ్రైవర్,అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, కిచెన్ బాయ్,కుక్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులు

మొత్తం పోస్టులు: 22

విద్య అర్హతలు:

పోస్టును బట్టి అర్హతలు భిన్నంగా ఉంటాయి.

1. 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ / డిప్లొమా / ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు.

2. సంబంధిత పోస్టుకు అవసరమైన టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.

3. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యత ఉంటుంది.

వయస్సు:

కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎస్సీ / ఎస్టీ / బీసీ / వికలాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

ఈ outsourcing ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:

ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నెల జీతం పోస్టును బట్టి మారుతుంది.

ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹15,600/- నుంచి ₹19,500/- వరకు జీతం ఇస్తారు. కొన్ని పోస్టులకు అనుభవం ఉన్నవారికి ఎక్కువ వేతనం ఇవ్వవచ్చు. మరే ఇతర అలవెన్సుస్ ఉండవు.

ఎంపిక విధానం:

Telangana Outsourcing Jobs Notification 2026 లో ముఖ్యంగా పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.

1. మెరిట్ లిస్ట్ ఆధారంగా

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. ఈ క్రింది విధం గా దరఖాస్తు చేసుకోవచ్చు.

1. అధికారిక వెబ్‌సైట్ లేదా జిల్లా ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

2. నోటిఫికేషన్ చదివి అర్హతలు పరిశీలించాలి.

3. ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారం నింపాలి.

4. అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి.

5. దరఖాస్తును సమర్పించాలి.

వెబ్సైటు : https://www.telangana.gov.in/

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2026.

Notification pdf : Click Here

Official Website : Click Here

Leave a Comment