Latest jobs

Volunteers Jobs : TS రాష్ట్రంలో 10,909 వాలంటీర్ల నియామకం.. పూర్తి వివరాలు

calendar_month February 18, 2026 person chitra

Volunteers Jobs : TS రాష్ట్రంలో 10,909 వాలంటీర్ల నియామకం.. పూర్తి వివరాలు:

Telangana Government Volunteers Recruitment For Yasangi Crop Survey – పూర్తి సమాచారం:

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. యాసంగి పంట సర్వే నిర్వహణ కోసం Telangana Government ఆధ్వర్యంలో 10,909 మంది వాలంటీర్లను నియమించేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున నియామకాలు చేపట్టనున్నారు.

యాసంగి పంట సర్వే కోసం వాలంటీర్ల నియామకం:

ప్రస్తుతం యాసంగి సీజన్‌లో పంటల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ విస్తరణ అధికారులతో (AEO) సర్వే చేయించగా, పూర్తి కావడానికి మూడు నెలల వరకు సమయం పడుతోంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయిలో వాలంటీర్లను నియమించాలని అధికారులు భావించారు.

ప్రతి గ్రామంలో స్థానికంగా నివసించే అభ్యర్థులను వాలంటీర్‌గా ఎంపిక చేస్తారు. పంట పొలాల ఫోటోలు తీసి, వాటిని ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది.

రోజుకు ఎంత సంపాదించవచ్చు?

ఎంపికైన వాలంటీర్లు ప్రతిరోజూ సుమారు 150 నుంచి 200 సర్వే నంబర్లకు సంబంధించిన పంట పొలాల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఒక్కో ఫోటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు ఉంటుంది.

యాసంగి సీజన్‌లో 45 రోజుల పాటు పని ఉంటుంది. ఈ కాలంలో గరిష్టంగా 2000 ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజుకు సుమారు రూ.1500 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అర్హతలు ఏమిటి?

ఈ వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:

1. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత

2. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

3. బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ డిప్లమా చేసిన వారికి ప్రాధాన్యత

4. గ్రామ భూములపై అవగాహన ఉండాలి

5. మొబైల్ యాప్ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి

6. స్థానికంగా నివసించే అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

గ్రామంలో నివసించే అర్హులైన అభ్యర్థులను మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల విద్యార్హతలు, స్థానిక పరిజ్ఞానం మరియు మొబైల్ వినియోగ నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ఎలా అప్లై చేయాలి?

అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు మరియు అవసరమైన పత్రాలతో సమీపంలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్ నింపి సమర్పించాలి. అధికారుల సూచనల ప్రకారం ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

Official Website: Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *