Latest jobs

TS కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – వాక్ ఇన్ ఇంటర్వ్యూ | TS Kendriya Vidyalaya Jobs Notification 2026:

calendar_month March 3, 2026 person chitra

TS కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – వాక్ ఇన్ ఇంటర్వ్యూ | TS Kendriya Vidyalaya Jobs Notification 2026 :

TS Kendriya Vidyalaya Jobs Notification 2026:

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న PM SHRI Kendriya Vidyalaya Karimnagar లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక ప్రక్రియలో పాల్గొనవచ్చు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం ప్రత్యేకత. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, కరీంనగర్ జిల్లా లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు:

1. PGT (Post Graduate Teacher)

2. TGT (Trained Graduate Teacher)

3. ప్రైమరీ టీచర్ (PRT)

4. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్

5. నర్స్

6. స్పోర్ట్స్ కోచ్

7. ఎడ్యుకేషనల్ కౌన్సిలర్

8. స్పెషల్ ఇన్‌స్ట్రక్టర్

9. వోకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

TS కేంద్రీయ విద్యాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

1. ఇంటర్మీడియట్ / డిగ్రీ ఉత్తీర్ణత.

2. TET లేదా CTET అర్హత.

3. B.Ed పూర్తి చేసి ఉండాలి (సంబంధిత పోస్టులకు వర్తిస్తుంది).

4. సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రత్యేక అర్హతలు ఉండాలి.

వయస్సు పరిమితి:

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది

దరఖాస్తు రుసుము:

1. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

2. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు

జీతం వివరాలు:

ఈ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయబడతాయి. పోస్టును అనుసరించి సుమారు ₹15,000/- నుండి ₹30,000/- వరకు నెలవారీ వేతనం చెల్లించే అవకాశం ఉంది.

ఎంపిక విధానం:

1. అభ్యర్థులు అప్లికేషన్ ఫారం మరియు అవసరమైన అసలు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

2. ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ జరుగుతుంది

3. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది ఎంపిక చేపడతారు.

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అవ్వాలనుకునే వారు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు:

ఇంటర్వ్యూ ప్రదేశం: PM SHRI Kendriya Vidyalaya, Karimnagar.

ఇంటర్వ్యూ తేదీ: 6 మార్చి 2026

ముఖ్యమైన లింకులు:

Notification PDF: Click Here

Official Website: Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Nowg

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *