TS SSC Hall Tickets 2026 Released |10th క్లాస్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
TS SSC Hall Tickets 2026 Released |10th క్లాస్ హాల్ టికెట్స్ వాట్సాప్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకోండి…
TS SSC Hall Tickets 2026 Released :
తెలంగాణ రాష్ట్రంలో TS SSC Hall Tickets 2026 అధికారికంగా విడుదల అయ్యాయి. తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు త్వరలో ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో గురువారం రోజున SSC హాల్ టికెట్లు విడుదల చేశారు. ఈ హాల్ టికెట్లు Regular, Private, Vocational, OSSC Regular మరియు OSSC Private విభాగాలకు చెందిన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థులు తమ TS SSC Hall Ticket 2026 ను అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదనంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అందించిన WhatsApp సేవ ద్వారా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది.
అలాగే విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Headmaster) దగ్గర కూడా హాల్ టికెట్ పొందవచ్చు.
TS SSC Hall Tickets 2026 WhatsApp ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
విద్యార్థులు WhatsApp ద్వారా కూడా సులభంగా తమ హాల్ టికెట్ పొందవచ్చు. దానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
Step 1: ముందుగా మీ మొబైల్లో WhatsApp ఓపెన్ చేసి 8096958096 నెంబర్‌ను సెర్చ్ చేయండి.
Step 2: అక్కడ MeeSeva Telangana అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి HI అని మెసేజ్ పంపండి.
Step 3: తర్వాత మెసేజ్‌లో “SSC Hall Ticket March 2026” అని టైప్ చేసి పంపండి.
Step 4: మీకు SSC Hall Ticket Open Service అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
Step 5: తర్వాత Download SSC Hall Ticket – Start అనే ఆప్షన్ వస్తుంది. Start పై క్లిక్ చేయండి.
Step 6: ఇప్పుడు మీ District ను సెలెక్ట్ చేసి Continue పై క్లిక్ చేయండి.
Step 7: ఆ తర్వాత మీ School Name చివరి 3 అక్షరాలు (Last 3 Letters) ఎంటర్ చేయాలి.
Step 8: తరువాత స్కూల్ పేరు, విద్యార్థి పేరు, Date of Birth మరియు మీ Stream (Regular / Private / Vocational / OSSC Regular / OSSC Private) ఎంపిక చేయాలి.
Step 9: చివరగా Get Hall Ticket పై క్లిక్ చేస్తే మీ TS SSC Hall Ticket 2026 డౌన్లోడ్ అవుతుంది.
విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా అవసరం. కాబట్టి ముందుగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
TS 10th Class Hall Ticket 2026 Released Direct Link: Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now