TS TET 2025 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ … ఈవిధంగా డౌన్లోడ్ చేసుకోండి. | Download TS TET 2025 Admit Cards :

TS TET 2025 అడ్మిట్ కార్డ్స్ విడుదల … ఈవిధంగా డౌన్లోడ్ చేసుకోండి. | Download TS TET 2025 Admit Cards :

TS TET 2025 Admit Cards Download:

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. TS TET 2025 (Telangana State Teacher Eligibility Test) ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ పోస్టులకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా తమ హాల్ టికెట్‌ను ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలి.

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 జనవరి 3, 2026 నుంచి 31 జనవరి 2026 వరకు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ పరీక్ష కు పేపర్ 1 & 2 మొత్తం కలిపి 2,26,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కానీ పరీక్షలు రాసేందుకు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ అడ్మిట్ కార్డ్స్ 27 డిసెంబర్ 2025 నుంచి అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

TS TET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల వివరాలు:

పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం TS TET 2025 అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ సహాయంతో హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అడ్మిట్ కార్డులు పోస్టు ద్వారా పంపబడవు, కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ అడ్మిట్ కార్డ్స్ 27 డిసెంబర్ 2025 నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

TS TET 2025 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

1. ముందుగా TS TET అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

2. హోమ్‌పేజ్‌లో Hall Ticket” లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ రిజిస్ట్రేషన్ నంబర్ / అప్లికేషన్ నంబర్ నమోదు చేయండి.

4. పుట్టిన తేదీ (DOB) ఎంటర్ చేయండి.

5. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

6. స్క్రీన్‌పై TS TET 2025 అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.

7. దాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

అధికారిక వెబ్సైటు: Click Here

Leave a Comment