AP Jobs

Tirumala Tirupati Devasthanams Jobs 2026: రాత పరీక్ష లేకుండా టిటిడి హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు:

calendar_month February 23, 2026 person chitra

Tirumala Tirupati Devasthanams Jobs 2026: రాత పరీక్ష లేకుండా టిటిడి హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు:

TTD Hospitals Recruitment 2026 Notification పూర్తి వివరాలు :

తిరుమల – తిరుపతిలోని టిటిడి ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. టిటిడి హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక చేసే అవకాశం కల్పించారు. ఈ నియామకాలు ఒక సంవత్సరం కాలపరిమితితో కాంట్రాక్ట్ విధానంలో జరుగుతాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీన నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD Walk-In Interview 2026 Selection Process:

పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ లో ఉద్యోగాలు

మొత్తం పోస్టులు : 08

ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ (1 సంవత్సరం)

ఇంటర్వ్యూ స్థలం: సెంట్రల్ హాస్పిటల్, తిరుపతి

విద్య అర్హతలు:

1. UGC గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. రాష్ట్ర చట్టాల ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి.

3. MD/MS వంటి PG అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

4. అభ్యర్థులు హిందూ మతాన్ని అనుసరించే వారై ఉండాలి.

వయోపరిమితి :

01-02-2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 56 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఈ నియామకాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.53,495/- కాంట్రాక్ట్ వేతనం చెల్లించబడుతుంది. చట్టబద్ధమైన తగ్గింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ:

1. ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

2. అర్హత పరీక్షలో (MBBS) పొందిన మొత్తం మార్కులకు 80% వెయిటేజ్ ఇవ్వబడుతుంది.

3. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు.

4. ప్రసిద్ధ ఆసుపత్రుల్లో పని చేసిన అనుభవానికి 10% వెయిటేజ్ ఇవ్వబడుతుంది.

5. ఈ ప్రమాణాల ఆధారంగా తుది ఎంపిక జాబితా సిద్ధం చేయబడుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు టిటిడి అధికారిక వెబ్‌సైట్ Tirumala Tirupati Devasthanams ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. పూర్తిగా నింపిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లు తీసుకుని నిర్ణీత తేదీన సెంట్రల్ హాస్పిటల్, తిరుపతిలో జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

3. నియామకాలకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించడం మంచిది.

4. అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహణలో మార్పులు చేయడానికి సంస్థకు హక్కు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 ఫిబ్రవరి 2026

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 05 మార్చ్ 2026

Notification pdf : Click Here

Application pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *