8వ, 10వ తరగతి అర్హతతో ల్యాబ్ అటెండెంట్ & అసిస్టెంట్ ఉద్యోగాలు …..వెంటనే అప్లై చేయండి | UGC DAE CSR Notification 2026 Full Details :
8వ, 10వ తరగతి అర్హతతో ల్యాబ్ అటెండెంట్ & అసిస్టెంట్ ఉద్యోగాలు …..వెంటనే అప్లై చేయండి | UGC DAE CSR Notification 2026 Full Details :
UGC DAE CSR Notification 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. UGC-DAE Consortium for Scientific Research (UGC-DAE CSR) నుండి అసిస్టెంట్-II, అసిస్టెంట్-I, క్లర్క్-టైపిస్ట్ మరియు ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 8వ తరగతి, 10వ తరగతి, డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 04 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.csr.res.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 16 ఫిబ్రవరి 2026 ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై, 06 మార్చి 2026 సాయంత్రం 05:00 గంటల వరకు కొనసాగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు : UGC-DAE కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్-II
2. అసిస్టెంట్-I
3. క్లర్క్-టైపిస్ట్
4. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 04
ఉద్యోగ రకం: రెగ్యులర్ బేసిస్
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
విద్య అర్హతలు:
అసిస్టెంట్-II:
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ
2. కొనుగోలు/ఖాతాలు/స్థాపన విభాగంలో 5 సంవత్సరాల అనుభవం .
అసిస్టెంట్-I:
1. HSC లేదా తత్సమానం మరియు 8 సంవత్సరాల అనుభవం లేదా
2. బ్యాచిలర్ డిగ్రీ మరియు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
క్లర్క్-టైపిస్ట్:
1. 50% మార్కులతో మెట్రిక్యులేషన్
2. ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు
3. కంప్యూటర్ డిప్లొమా/సర్టిఫికెట్
4. అకౌంట్స్/ఫైనాన్స్ అనుభవం
ల్యాబ్ అటెండెంట్:
1. 8వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
2. 3 సంవత్సరాల అనుభవం
వయో పరిమితి:
1. పోస్ట్‌ను అనుసరించి అభ్యర్థి వయస్సు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
శాలరీ వివరాలు:
1. అసిస్టెంట్-II: పే లెవల్ 6 నెలకి ₹35,400/- నుండి ₹1,12,400/- మధ్య జీతం ఇస్తారు .
2. అసిస్టెంట్-I: పే లెవల్ 4 నెలకి ₹25,500/- నుండి ₹81,100/- మధ్య జీతం ఉంటుంది.
3. క్లర్క్-టైపిస్ట్: పే లెవల్ 2 నెలకి ₹19,900/- నుండి ₹63,200/- జీతం ఇస్తారు.
4. ల్యాబ్ అటెండెంట్: పే లెవల్ 1 నెలకి ₹18,000/- నుండి ₹56,900/- జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
1. సాధారణ అభ్యర్థులు: ₹500/- (SBI Collect ద్వారా చెల్లించాలి)
2. SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు.
ఎంపిక విధానం:
1. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష / నైపుణ్య పరీక్ష / ట్రేడ్ టెస్ట్ / ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.
2. పరీక్షలు ఇండోర్ ప్రధాన కార్యాలయం లేదా ముంబై, కోల్‌కతా, కల్పక్కం, భువనేశ్వర్ కేంద్రాలలో నిర్వహించే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్సైట్ https://www.csr.res.in కు వెళ్లాలి.
2. Recruitment విభాగంలో ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి.
3. అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
4. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి.
5. అప్లికేషన్ ప్రింట్ తీసుకుని, స్వీయ ధృవీకరించిన పత్రాల కాపీలతో ఈ చిరునామాకు పంపాలి:
To,
Recruitment Cell,
UGC-DAE Consortium for Scientific Research,
University Campus, Khandwa Road.
Indore – 452001, India.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ : 06 మార్చి 2026
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now