డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ విడుదల ..ఇలా అప్లై చేసుకోండి | UPSC IFS Notification 2026 Apply Now :
డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ విడుదల ..ఇలా అప్లై చేసుకోండి | UPSC IFS Notification 2026 Apply Now :
UPSC IFS Notification 2026:
హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు మంచి శుభవార్త…. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం సాధించేందుకు గొప్ప అవకాశం వచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) నోటిఫికేషన్ 2026 విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అటవీ శాఖలో గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 80 పోస్టులతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి వయస్సు కూడా 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ,ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
UPSC IFS పోస్టుల వివరాలు – ముఖ్య సమాచారం:
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 80
విద్య అర్హతలు:
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
1. కనీస వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు SC / ST అభ్యర్థులు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులు 3 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు రూ 100/- ఫీజు ఆన్లైన్ లో చెల్లించాలి.
2. రిజర్వేషన్ ఉన్న SC , ST , PWD , మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు .
శాలరీ వివరాలు:
UPSC IFS ద్వారా ఎంపికైన అభ్యర్థులకు Level-10 పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది.
1. ప్రారంభ జీతం నెలకి ₹ 1,00,000/- వరకు ఉంటుంది.
2. DA, HRA, TA వంటి అలవెన్సులు అదనంగా లభిస్తాయి.
3. ప్రభుత్వ క్వార్టర్స్, వాహన సౌకర్యం, పెన్షన్ వంటి సదుపాయాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
UPSC IFS ఉద్యోగాల ఎంపిక విధానం మూడు దశల్లో జరుగుతుంది:
1. ప్రిలిమ్స్ పరీక్ష (Preliminary Examination)
2. మెయిన్స్ పరీక్ష (Main Examination)
3. ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్
4. ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
UPSC IFS Notification 2026 అప్లై చేసే విధానం క్రింది విధం గా ఉంటుంది.
1. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేయాలి.
2. UPSC అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి – https://www.upsc.gov.in
3. “IFS Notification 2026” లింక్‌పై క్లిక్ చేయండి.
4. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయండి.
5. అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి.
6. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
7. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
8. ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 4 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2026
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website :Click Here