AP Jobs

విజయవాడ ఎయిర్పోర్ట్ లో AIASL ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…..11 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు… పూర్తి వివరాలు :

calendar_month February 27, 2026 person chitra

విజయవాడ ఎయిర్పోర్ట్ లో AIASL ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…..11 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు… పూర్తి వివరాలు :

AI Airport Services Limited Vijayawada Airport AIASL Trainee Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Vijayawada International Airport లో పనిచేయడానికి AI Airport Services Limited (AIASL) సంస్థ నుంచి తాజా ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Passenger Service Agent (Trainee) పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. AIASL సంస్థ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ దేశవ్యాప్తంగా 80కి పైగా ఎయిర్‌పోర్టుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ. విమానాశ్రయ కార్యకలాపాల్లో ప్రయాణికుల సేవలు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, కార్గో సపోర్ట్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: AI Airport Services Limited (AIASL) సంస్థ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: Passenger Service Agent (Trainee) పోస్టులు

పని ప్రదేశం: విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

ట్రైనింగ్ కాలం: 11 నెలలు

స్టైపెండ్ వివరాలు:

అభ్యర్థులకు ₹10,000/- ప్రతినెల ట్రైనింగ్ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

1. పూర్తిగా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

2. అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ట్రైనీలుగా ఎంపిక చేస్తారు.

వర్క్ షెడ్యూల్:

1. వారానికి 6 రోజులు పని

2. మూడు షిఫ్ట్ ప్యాటర్న్స్

3. ఒక పెయిడ్ వీక్లీ ఆఫ్

4. ప్రతి నెల ఒక లీవ్ సదుపాయం కల్పిస్తారు.

సర్టిఫికెట్ వివరాలు:

11 నెలల ట్రైనింగ్ పూర్తయ్యాక హాజరు మరియు పనితీరు సంతృప్తికరంగా ఉంటే, AIASL సంస్థ నుండి Certificate of Completion అందజేయబడుతుంది.

జాబ్ ప్రొఫైల్ – చేయవలసిన పనులు:

ఎంపికైన ట్రైనీలు టెర్మినల్ మరియు ర్యాంప్ ఏరియాలో క్రింది పనులు నిర్వహించాలి:

1. చెక్-ఇన్ మరియు బ్యాగేజ్ హ్యాండ్లింగ్

2. టికెటింగ్ & రిజర్వేషన్ సపోర్ట్

3. బ్యాగేజ్ మేకప్ / బ్రేకప్ ఏరియా పనులు

4. కార్గో మానిఫెస్టింగ్

5. ప్రయాణికుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ (వీసా చెకింగ్ మొదలైనవి)

6. కస్టమర్ సర్వీస్ & కంప్లైంట్ హ్యాండ్లింగ్

7. VIP గెస్ట్ హ్యాండ్లింగ్

8. నైట్ షిఫ్ట్‌లతో సహా అన్ని షిఫ్ట్‌లలో పని చేయాలి.

ఎలా అప్లై చేయాలి?

ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు వ్యక్తిగతంగా అప్లై చేయలేరు. గుర్తింపు పొందిన ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అభ్యర్థుల జాబితా పంపించాలి.

సంబంధిత ఇన్స్టిట్యూట్ ఈ వివరాలు పంపాలి:

1. అభ్యర్థి పేరు

2. వయస్సు

3. విద్యార్హతలు

4. కాంటాక్ట్ వివరాలు

5. సంస్థ అఫిలియేషన్ డాక్యుమెంట్స్

పంపవలసిన ఈమెయిల్: officer.hrsr@aiasl.in

చివరి తేదీ: 04 మార్చ్ 2026

Notification pdf : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *