Information

AP Half Day Junior Colleges Timings 2026: ఒంటిపూట కళాశాల టైమింగ్స్ మార్పులు – పూర్తి వివరాలు:

calendar_month March 31, 2026 person chitra

AP Half Day Junior Colleges Timings 2026: ఒంటిపూట కళాశాల టైమింగ్స్ మార్పులు – పూర్తి వివరాలు:

AP Half Day Junior Colleges Timings 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్. రాష్ట్రంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని, జూనియర్ కళాశాలలను ఒంటిపూట (Half Day) విధానంలో నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ రంజిత్ బాషా ఆదేశాల ప్రకారం, 2026 ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు హాఫ్ డే పద్ధతిలో కొనసాగనున్నాయి.

కళాశాల టైమింగ్స్ & అమలు విధానం:

1. క్లాస్ సమయం: ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు

2. క్లాసులు ముగిసిన వెంటనే విద్యార్థులను ఇంటికి పంపించాలి.

3. భోజనం తరువాత ఎలాంటి క్లాసులు నిర్వహించరాదు.

4. ప్రతి కళాశాల తమకు అనుగుణంగా టైమ్‌టేబుల్ రూపొందించుకోవచ్చు.

ఈ హాఫ్ డే విధానం కింది జూనియర్ కళాశాలలకు వర్తిస్తుంది:

1. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు

2. ఎయిడెడ్ కళాశాలలు

3. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కళాశాలలు

4. సాంఘిక సంక్షేమ & గిరిజన సంక్షేమ కళాశాలలు

5. AP రెసిడెన్షియల్, KGBV, మోడల్ స్కూల్స్

6. హై స్కూల్ ప్లస్ & BC వెల్ఫేర్ కళాశాలలు

7. కాంపోజిట్ డిగ్రీ కళాశాలలు

8. సెకండ్ ఇయర్ క్లాసుల ప్రారంభం

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్ 1, 2026 నుండి క్లాసులు ప్రారంభం అవుతాయి. ఈ క్లాసులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి.

వేసవి సెలవులు :

సెలవులు ప్రారంభం: ఏప్రిల్ 24, 2026
సెలవులు ముగింపు: మే 31, 2026
కళాశాలలు తిరిగి ప్రారంభం: జూన్ 1, 2026

పరీక్షలు & ఫలితాల వివరాలు:

మూల్యాంకనం (Valuation): ఏప్రిల్ 10 నుండి 14 వరకు
ఫలితాల విడుదల: ఏప్రిల్ 21, 2026

Academic Calendar 2026-27 ముఖ్యాంశాలు:

1. మొత్తం పని దినాలు: 232 రోజులు

2. జిల్లా మరియు ప్రాంతీయ అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేయబడ్డాయి.

3. కళాశాల యాజమాన్యాలు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *