జిల్లా కోర్ట్ లో టైపిస్ట్-కమ్-అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల….వెంటనే అప్లై చేసుకోండి.| District Court Recruitment 2026:
జిల్లా కోర్ట్ లో టైపిస్ట్-కమ్-అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల….వెంటనే అప్లై చేసుకోండి.| District Court Recruitment 2026:
District Court Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! జిల్లా న్యాయ సేవల అథారిటీ పరిధిలోని శాశ్వత ప్రజా వినియోగ సేవల లోక్ అదాలత్ కార్యాలయంలో Typist-cum-Assistant ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాన్ని ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైప్‌రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు గడువు ముగిసేలోపు తమ అప్లికేషన్లను కర్నూలు జిల్లా కోర్టు కార్యాలయానికి పంపించాలి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : జిల్లా న్యాయ సేవల అథారిటీ లో ఉద్యోగాలు
కార్యాలయం : శాశ్వత ప్రజా వినియోగ సేవల లోక్ అదాలత్
పోస్టు పేరు : Typist-cum-Assistant
ఉద్యోగాల విధానం : కాంట్రాక్ట్ ప్రాతిపదికన
ఉద్యోగ కాలపరిమితి : ఒక సంవత్సరం
పని ప్రదేశం : కర్నూలు, ఆంధ్రప్రదేశ్
విద్యార్హతలు :
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
3. కంప్యూటర్ నిర్వహణపై పరిజ్ఞానం లేదా సంబంధిత అర్హత తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
అభ్యర్థుల వయస్సును 31-10-2026 నాటికి లెక్కిస్తారు.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు మధ్య ఉండాలి.
SC, ST, BC అభ్యర్థులకు అదనంగా 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,220/- వేతనం చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక తాత్కాలిక ప్రాతిపదికన జరుగుతుంది. అవసరాన్ని బట్టి అభ్యర్థులకు కింది పరీక్షలు నిర్వహించవచ్చు.
1. ఇంగ్లీష్ టైపింగ్ పరీక్ష.
2. ఇంటర్వ్యూ.
ఈ పరీక్షలు, ఇంటర్వ్యూలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు.
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశించిన ప్రోఫార్మాలో తమ బయోడేటా మరియు అవసరమైన వివరాలతో దరఖాస్తును పూర్తి చేయాలి.
పూర్తి చేసిన దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా సంబంధిత కార్యాలయంలో అందజేయవచ్చు. కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశం ఉంది.
దరఖాస్తు పంపించాల్సిన చిరునామా:
ఛైర్మన్-కమ్-ప్రిన్సిపల్ జిల్లా జడ్జి,
జిల్లా న్యాయ సేవల అథారిటీ,
న్యాయ సేవా సదన్,
జిల్లా కోర్టు ఆవరణ,
కర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారికి చేరేలా పంపించాలి.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తులకు చివరి తేదీ : 20 నవంబర్ 2026
Notification & Application Pdf Click Here