TS Inter 2026 Results OUT – ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ వివరాలు:
TS Inter 2026 Results OUT – ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా? పూర్తి స్టెప్ బై స్టెప్ వివరాలు:
TS Inter Results 2026 Release Today:
తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు మరియు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గారు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
ముందుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయాలని భావించినప్పటికీ, సమయ పరిమితుల కారణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఏడాది దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు మార్చి 13వ తేదీతో ముగిశాయి. ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి: https://tgbie.cgg.gov.in/
వాట్సాప్ ద్వారా TS Inter Results 2026 ఎలా చెక్ చేయాలి?
1. విద్యార్థులు చాలా సులభంగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
2. మీ మొబైల్లో WhatsApp ఓపెన్ చేయండి.
3. ఈ నెంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి 8096958096.
4. మెనూలో నుండి “BIE Results” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
5. తరువాత “BIE Exam Result – Start Service” పై క్లిక్ చేయండి.
6. ఇప్పుడు Results ఆప్షన్ ఎంచుకోండి.
7. మీ వివరాలు నమోదు చేయండి:
a ) Inter Hall Ticket Number / Roll Number
b ) Year (1st Year / 2nd Year)
c )Stream (General / Vocational / Bridge Course)
8. చివరగా Get Results పై క్లిక్ చేయండి.
9. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అధికారిక వెబ్సైట్ ద్వారా TS Inter Results 2026 ఎలా చెక్ చేయాలి?
1. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా కూడా సులభంగా రిజల్ట్స్ చూడవచ్చు.
2. https://tgbie.cgg.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
3. హోమ్‌పేజీలో 1st Year లేదా 2nd Year ఎంపిక చేయండి.
4. మీ Hall Ticket Number మరియు ఇతర వివరాలు నమోదు చేయండి.
5. “Submit / Get Memo” బటన్‌పై క్లిక్ చేయండి.
6. మీ ఇంటర్ మార్క్స్ మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ముఖ్య సూచన:
ఫలితాలు విడుదల సమయంలో సర్వర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సమయం ఆగి మళ్లీ ప్రయత్నించడం మంచిది.
TS Intermediate Results Direct Link
TS Intermediate 2026 Results Direct Link